Hackers: హాస్పిటల్స్‌ సర్వర్స్‌పై హ్యాకింగ్ పంజా

  • Written By:
  • Publish Date - December 7, 2022 / 07:58 AM IST

మొన్న ఎయిమ్స్‌.. నిన్న సఫ్దర్‌జంగ్‌.. నేడు ఐసీఎంఆర్‌.. దేశంలోని ప్రధాన హాస్పిటల్స్‌ టార్గెట్‌గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో హాస్పిటల్‌ సర్వర్స్‌పై హ్యాకింగ్‌ పంజా విసురుతూ ఛాలెంజ్‌ చేస్తున్నారు. 12 రోజులుగా ఎయిమ్స్‌ సర్వర్లు హ్యాకర్స్‌ (Hackers) చేతుల్లోనే ఉన్నాయి. అసలు హ్యాకర్లు ఆసుపత్రులనే ఎందుకు టార్గెట్‌ చేసుకున్నారునేది ఇప్పుడు అందరీని వేధిస్తున్న ప్రశ్న.

దేశంలో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలు, రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్స్ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు (Hackers).. ఇండియన్ కౌన్సిల్‌ ఫర్ మెడికల్ రీసెర్చ్‌ ICMR సర్వర్లపైనా దాడికి యత్నించినట్టు నేషనల్ ఇన్ఫర్మేషన్‌ సెంటర్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 30న 24 గంటల్లో 6 వేలసార్లు ICMR సర్వర్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే NIC ముందే అలర్ట్ చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. ఫైర్‌వాల్‌లో ఏ మాత్రం లూప్ హోల్స్ ఉన్నా.. హ్యాకర్లు పంజా విసిరేవారని పేర్కొన్నాయి NIC వర్గాలు.

హ్యాకర్ల ఐపీ అడ్రస్‌లు హ్యాంకాంగ్‌కు చెందినవిగా గుర్తించాయి. గడిచిన రెండు వారాల్లో ఐదు కీలక సంస్థల్లో హ్యాకింగ్ ఘటనలు వెలుగుచూశాయి. ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లపై నవంబర్‌ 23న దాడికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య సమాచారం చోరీ చేసి డార్క్ వెబ్‌లో అమ్మేశారు హ్యాకర్లు. 200 కోట్లు క్రిప్టో కరెన్సీ డిమాండ్ చేశారు. ఈ రాన్సమ్‌వేర్‌ అటాక్‌తో కుప్పకూలిన సర్వర్లు 12 రోజులైనా బాగుపడలేదు. ఎయిమ్స్ సైబర్‌ అటాక్ మూలాలు చైనాలో ఉన్నట్టు గుర్తించారు ఐటీ నిపుణులు. ఇది జరిగిన మూడు రోజులకే ఢిల్లీలోనే సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌పైనా సైబర్‌ దాడి జరిగింది.

Also Read: Honey Trap in Odisha: నా దగ్గర వీడియోలున్నాయి.. బయట పెడితే స్టేట్ షేక్ అవుతుంది: అర్చనా నాగ్

అలాగే డిసెంబర్‌ 1న కేంద్ర జలశక్తి శాఖ ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. తమిళనాడులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ పైనా సైబర్‌ దాడులు చేశారు హ్యాకర్లు. లక్షన్నర మంది రోగుల డేటాను చోరీ చేశారు. ఆరోగ్య వివరాలను అంగట్లో అమ్మకానికి పెట్టేశారు. డిజిటల్‌ ఇండియాలో అన్నిరకాల ప్రభుత్వ విధులు, ప్రజా సేవలు, నగదు చెల్లింపులు ఆన్‌లైన్‌లోకి మారాయి. ఈ క్రమంలో అదను చూసి పంజా విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. కీలక డేటాను దొంగిలించి అంగట్లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. సైబర్‌ అటాక్స్‌కు చెక్‌ పెట్టాలంటే మరింత సురక్షిత వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ఆపద సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు .