Site icon HashtagU Telugu

Angel Tax : స్టార్టప్‌లలో పెట్టుబడులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.. ఏమిటీ ట్యాక్స్ ?

Net Direct Tax Collections

Angel Tax :  స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. స్టార్టప్‌లలోని అన్ని కేటగిరీలకు చెందిన పెట్టుబడిదారులపై ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆమె మంగళవారం పార్లమెంటులో అనౌన్స్ చేశారు. భారతీయ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేసే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ఏంజెల్ ట్యాక్స్ అంటే ?

ఏంజెల్ ట్యాక్స్ అనేది ఒక రకమైన ఆదాయపు పన్ను. దేశంలోని స్టార్టప్‌లు లేదా అన్ లిస్టెడ్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్(Angel Tax)  విధించేవారు. స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు ఆ సంస్థ షేర్లను వాటి వాస్తవిక ధర కంటే ఎక్కువ రేటుకు ఇన్వెస్టర్లకు విక్రయించి నిధులు సమీకరించిన సందర్భాల్లో ఏంజెల్ ట్యాక్స్‌ను విధించేవారు. ఇకపై స్టార్టప్‌లలో  ఇన్వెస్ట్ చేసే వారికి ఆ బాధ ఉండదు. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ల పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద 1.17 లక్షలకుపైగా స్టార్టప్‌లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవన్నీ ఈ మినహాయింపు ద్వారా ఇకపై ప్రయోజనం పొందొచ్చు.

Also Read :White Onion: తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసా?

Also Read :Pregnant Women: గర్భిణీ స్త్రీలు వంకాయలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?