Gold Price Today: గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ. 500 తగ్గి మంగళవారం ఉదయం సమయానికి రూ. 54,800 వద్దకు చేరింది.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 08:15 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ. 500 తగ్గి మంగళవారం ఉదయం సమయానికి రూ. 54,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 540 తగ్గి రూ. 59,780కు చేరింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.54,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,780గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 74,600 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (మార్చి 21, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,930గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,870గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,780 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,830గా ఉంది.

Also Read: Finland: అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్..!

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, ముంబైలో రూ.72,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,600 ఉండగా, కోల్‌కతాలో రూ.72,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,600 ఉండగా, కేరళలో రూ.74,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,600 ఉండగా, విజయవాడలో రూ.74,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.