Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రూ. 62 వేలకు చేరిన గోల్డ్ రేట్స్..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 08:55 AM IST

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ.950, 24 క్యారెట్లపై రూ. 1,030 ధర పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360గా ఉంది. కిలో వెండి ధర రూ.80,700 వద్ద కొనసాగుతోంది. ఏపీలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 80,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (ఏప్రిల్ 06, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,510గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,070గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410గా ఉంది.

Also Read: Kawasaki: మార్కెట్ లోకి మరో కవాసకి బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,090 ఉండగా, ముంబైలో రూ.77,090గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, కోల్‌కతాలో రూ.77,090గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, కేరళలో రూ.80,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, విజయవాడలో రూ.80,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.