మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహపుర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ (Maharashtra school)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్రూమ్ గోడపై రక్తపు మరకలు (blood stains) కనిపించడంతో, స్కూల్ సిబ్బంది పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినుల్ని గుర్తించేందుకు దుస్తులు విప్పించి పరిశీలించినట్లు తెలుస్తుంది. ఈ దారుణ ఘటన జులై 8న చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించడంతో, ప్రిన్సిపల్‌తో పాటు మహిళా ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Fuel Control Switch : అసలు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ అంటే ఏంటి ? ఇవి ఎలా పనిచేస్తాయి?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆ రోజున 125 మంది విద్యార్థినులను స్కూల్ హాల్‌కు పిలిపించి, ప్రొజెక్టర్ ద్వారా బాత్రూమ్ గోడలపై కనిపించిన రక్తపు మరకల ఫోటోలను చూపించారు. అనంతరం పీరియడ్స్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు విద్యార్థినుల చేతి ముద్రలు తీసుకోవడమే కాక, కొంతమంది అమ్మాయిలను బాత్రూమ్‌కు తీసుకెళ్లి వారి దుస్తులు విప్పించి తనిఖీ చేసినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ విద్యార్థినులలో భయాన్ని, అవమానాన్ని కలిగించాయి. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహంతో స్పందించారు. తమ పిల్లలు తీవ్ర మానసిక దెబ్బతిన్నారని, భవిష్యత్తులో స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని చెప్పారు. ‘‘పీరియడ్స్‌లో లేని నా కూతురిని ఎందుకు అనుమానంతో చూశారు? శానిటరీ ప్యాడ్ ఎందుకు పెట్టుకోలేదని విమర్శించడం ఏంటీ?’’ అంటూ ఒక తల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Amazon prime day offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌తో పాటు మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేశారు. స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఇదిలా ఉండగా, తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, విద్యార్థినుల దుస్తులు విప్పడం జరుగలేదని ప్రిన్సిపల్ చెపుతుంది. అయినప్పటికీ, విద్యార్థుల హక్కులను ఉల్లంఘించిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.