Five Working Days : ఈ ఏడాది జూన్ నుంచే బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఈ నిర్ణయం అమలు దిశగా అడుగులు పడనున్నాయి. వాస్తవానికి దీనిపై గతంలో బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఓ లేఖ రాసింది. ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది.
We’re now on WhatsApp. Click to Join
బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదురోజుల పనిదినాలు కల్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఈ డిమాండ్ 2015 సంవత్సరం నుంచే ఉంది. ప్రస్తుతానికి ప్రతినెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంది. గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులకు 17 శాతం వేతనం పెరిగింది. ఒకవేళ వారంలో ఐదు రోజుల పనిదినాలపై బ్యాంకు యూనియన్ల రిక్వెస్టును కేంద్ర ఆర్థికశాఖ అమోదం తెలిపితే.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో 3.8 లక్షల మంది అధికారులు సహా 9 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్ లభిస్తుంది. వీటికి తోడుగా వేతనపెంపు కూడా వర్తించనుంది.
Also Read : Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే
అయితే 5 రోజుల పనిదినాల (Five Working Days) వల్ల బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు ఏమాత్రం తగ్గిపోవని.. ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు జరగవని అంటున్నారు. వారంలో ఐదురోజుల పనిదినాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్‌బీఐ, ఎల్ఐసీ సంస్థల్లోనూ అమలవుతున్నాయి. ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ కోరుతోంది.