New Pope Race: కొత్త పోప్ ఎన్నిక.. రేసులో నలుగురు భారతీయులు

పోప్ ఎన్నిక కోసం.. కాన్‌క్లేవ్‌లో అర్హత పొందిన కార్డినల్స్(New Pope Race) రహస్య ఓటింగ్ విధానంలో ఓట్లు వేస్తారు.

Published By: HashtagU Telugu Desk
New Pope Race Indians Hyderabad Kerala

NewPope Race: వాటికన్ సిటీకి కాబోయే కొత్త పోప్ ఎవరు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. క్యాథలిక్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఈ అత్యున్నతమైన  హోదా కోసం పోటీ పడుతున్న వారిలో మన భారతీయులు కూడా ఉన్నారు. వారి పేర్లు.. కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్, కార్డినల్ బసేలియోస్ క్లీమిస్, కార్డినల్ ఆంథోనీ పూల, కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్.

Also Read :Kasireddy : వసూళ్లతో లింకు లేదన్న కసిరెడ్డి.. విజయసాయి సంచలన ట్వీట్

ప్రధాన పోటీ వీరి మధ్యే.. 

  • పోప్ ఫ్రాన్సిస్ చనిపోయినందున 9 రోజుల తర్వాత నూతన పోప్ ఎన్నికకు సన్నాహాలను మొదలుపెడతారు.
  • పోప్ ఎన్నిక కోసం.. కాన్‌క్లేవ్‌లో అర్హత పొందిన కార్డినల్స్(New Pope Race) రహస్య ఓటింగ్ విధానంలో ఓట్లు వేస్తారు.
  • ఏప్రిల్ 19 నాటికి ప్రపంచవ్యాప్తంగా 252 మంది కార్డినల్స్ హోదాలో ఉన్నారు.  అయితే పోప్ ఎన్నికలో 80 ఏళ్లలోపు వారే ఓటు వేయాలి.  ఈ లెక్కన కొత్త పోప్‌ ఎన్నికలో  135 మంది కార్డినల్స్‌కు మాత్రమే ఓటుహక్కు ఉంది.  వారిలో నలుగురు ఇండియన్స్ ఉన్నారు.
  • ఓటింగ్ రోజున సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ వస్తే ఇంకా ఎంపిక పూర్తికాలేదని అర్థం. ఒకవేళ తెల్లటి పొగ వస్తే కొత్త పోప్ ఎన్నిక పూర్తయిందని అర్థం.
  • పోప్ పదవికి సంబంధించిన ఈ పోటీలో నంబర్ 1 స్థానంలో పియట్రో పరోలిన్‌ (70) ఉన్నారు. రెండో స్థానంలో రాబర్ట్‌ ప్రివోస్ట్‌ (69) ఉన్నారు. తదుపరి స్థానాల్లో పీటర్‌ ఎర్డో (72), మార్క్‌ ఓలెట్‌ (80), రీన్‌హార్డ్‌ మార్క్స్‌ (71), క్రిస్టోఫ్‌ షోన్‌బోర్న్‌ (80), మ్యాటియో జుప్పీ (69), లూయీ ట్యాగిల్‌ (67) ఉన్నారు.
  • భారత్‌కు చెందిన కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్ (51) కార్డినల్ డీకన్‌గా ఉన్నారు.
  • కార్డినల్ ఫిలిప్ నేరి ఆంటోనియో సెబాస్టియావో డో రోసారియో ఫెర్రావ్(72) గోవా, డామన్ (భారతదేశం) మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు.
  • భారత కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్, ఆసియా బిషప్‌ల సమావేశాల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఫిలిప్ నేరి ఆంటోనియో వ్యవహరిస్తున్నారు.
  • కార్డినల్ ఆంథోనీ పూల (63) హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు.
  • కార్డినల్ బాసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్ సైరో-మలంకర (భారతదేశం) త్రివేండ్రం మేజర్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. ఈయన సైరో-మలంకర చర్చి సైనాడ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Also Read :PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్

  Last Updated: 22 Apr 2025, 12:32 PM IST