Site icon HashtagU Telugu

Ajay Jadeja : మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇక జామ్‌నగర్ మహారాజు

Ajay Jadeja Jamnagar Royal Throne Gujarat

Ajay Jadeja : అజయ్ జడేజా.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌‌గా మనకు సుపరిచితం.  అయితే ఆయనకు బంపర్ ఆఫర్ దక్కిింది. జడేజాను గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిగా ప్రకటించారు. జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిని జాం సాహెబ్(మహారాజు) అని పిలుస్తుంటారు. ప్రస్తుత జాం సాహెబ్(మహారాజు)‌గా శత్రుసల్య సింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా ఉన్నారు. అజయ్‌ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని శత్రుసల్య వెల్లడించారు. ‘‘పాండవులు 14 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని ముగించుకొని విజయం సాధించిన రోజు దసరా.. అందుకే ఇవాళ అజయ్ జడేజాను(Ajay Jadeja) మా రాజ కుటుంబ వారసుడిగా ప్రకటిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. గుజరాత్‌లోని ఒకప్పటి రాచరిక సంస్థానం పేరు నవానగర్. దాన్నే ఇప్పుడు మనం జామ్‌నగర్‌గా పిలుస్తున్నాం.

Also Read :Cyber Attacks : ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం