Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో 71వేల మంది డిపాజిట్లు గల్లంతు

Elections 2024 : 1951-52 సంవత్సరంలో మనదేశంలో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Lok Sabha Election 2024

Elections Schedule

Elections 2024 : 1951-52 సంవత్సరంలో మనదేశంలో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ  ఎన్నికల్లో దాదాపు 71 వేల మంది ఎంపీ అభ్యర్థులు  సెక్యూరిటీ డిపాజిట్లను(Elections 2024) కోల్పోయారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధిస్తేనే డిపాజిట్ దక్కినట్టు లెక్క. ఎన్నికల డిపాజిట్లను కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్‌ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 (78 శాతం) మందికి   డిపాజిట్లే రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

  • 1951-52లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో 1874 మంది అభ్యర్థులకుగానూ 745 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
  • 1991-92లో జరిగిన  లోక్‌సభ ఎన్నికల్లో  86శాతం మంది అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు.
  • 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా 12,688 మంది డిపాజిట్లు కోల్పోయారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన లోక్‌సభ ఎన్నికలు ఇవే.
  • 2009లో 85 శాతం మంది అభ్యర్థులు,  2014లో 84 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

Also Read : CAA – Supreme Court : 237 సీఏఏ వ్యతిరేక పిటిషన్లకు సమాధానమివ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

బీఎస్పీ ఫస్ట్.. కాంగ్రెస్ సెకండ్

  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అత్యధికంగా బీఎస్పీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ పార్టీ నుంచి 383 మంది పోటీ చేస్తే 345 మంది డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెస్‌ నుంచి 421 మంది పోటీ చేయగా 148 మంది డిపాజిట్లు కోల్పోయారు.
  • డిపాజిట్లు కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారని విశ్లేషకులు అంటున్నారు.
  • అసలైన అభ్యర్థులకు నకలుగా (ప్రాక్సీగా)  కొందరిని ఎన్నికల బరిలోకి దించుతుంటారని పేర్కొంటున్నారు.

Also Read :C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు

  Last Updated: 19 Mar 2024, 06:32 PM IST