Site icon HashtagU Telugu

Bhupesh Baghel : భూపేష్ బఘేల్, చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ రైడ్స్

Ed Raids Bhupesh Baghels Son Chaitanya Baghel Liquor Scam Chhattisgarh

Bhupesh Baghel : బీజేపీ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఇవాళ ఉదయం నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి.  చైతన్య బఘేల్‌కు సంబంధించి ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా ఉన్న 14 ఆఫీసులు, నివాసాలపైనా రైడ్స్ జరుగుతున్నాయి.  భిలాయి నగరంలో ఉన్న భూపేష్ బఘేల్ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.

Also Read :Boinipally Srinivas Rao: బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ.. ఎవరాయన ?

ఈ కేసుల్లో..

మహదేవ్ యాప్ కేసు, బొగ్గు కుంభకోణాలకు సంబంధించి భూపేష్ బఘేల్(Bhupesh Baghel) ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌పై ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణం అభియోగాలు ఉన్నాయి. మద్యం కుంభకోణం వల్ల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగిందని, లిక్కర్ సిండికేట్ల జేబుల్లోకి రూ. 2,100 కోట్లు చేరాయని గతంలో ఈడీ ఆరోపించింది. ఈ కేసులో పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు సహా అనేక మందిని ఈడీ అరెస్టు చేసింది.ఈ స్కాంలతో ముడిపడిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈడీ రైడ్స్  జరుగుతున్నట్లు సమాచారం. తదుపరిగా వారిని ఈ వ్యవహారాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది. దాదాపు 15కుపైగా ఈడీ టీమ్‌లు ఈ రైడ్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఆయా చోట్ల లభించే ముఖ్యమైన పత్రాలతో పాటు డిజిటల్ డేటాను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు  సమాచారం.

తన కుటుంబంపై ఈడీ రైడ్స్ నేపథ్యంలో వెంటనే భూపేష్ బఘేల్ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఏడేళ్లుగా నడుస్తున్న తప్పుడు కేసును ఇప్పటికే కోర్టు కొట్టివేసింది. ఈడీ అధికారులు పిలవని అతిథుల్లా ఈరోజు తెల్లవారుజామునే భిలాయ్‌లో ఉన్న నా ఇంట్లోకి చొరబడి సోదాలు చేస్తున్నారు.  ఇలాంటి కుట్ర ద్వారా పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అడ్డుకట్ట పడుతుందని బీజేపీ భావించడం తప్పుడు అభిప్రాయమే అవుతుంది’’  అని పేర్కొంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.