భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్థాన్‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉగ్రదాడులకు తగిన ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు నాశనమవుతున్న తరుణంలో, ప్రకృతి కూడా పాక్ పట్ల తన ఆగ్రహాన్ని చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. శనివారం తెల్లవారుజామున 1:44 గంటలకు పాకిస్తాన్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది.
Nuclear Bomb: లాహోర్‌లో అణు బాంబు పేలితే ఏమవుతుంది? ఎంతమంది చనిపోతారు?
ఈ ప్రకంపనలు భూమికి 10 కిలోమీటర్ల లోతులో జరిగాయని అధికారులు తెలిపారు. ఇది ఇటీవల పాకిస్థాన్‌లో సంభవించిన నాలుగవ భూకంపం కావడం గమనార్హం. మే 5న కూడా 4.2 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. పాకిస్తాన్ యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రాంతంలో ఉండటంతో తరచుగా ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
పాకిస్తాన్ ఇటీవల భారత్‌పై డ్రోన్లు, మిస్సైళ్లు వాడి దాడి చేయాలని ప్రయత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థ అందుకు సమర్థవంతంగా ప్రతిస్పందించి వాటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసింది. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన యుద్ధ చర్యలు పాక్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి కూడా పాక్‌కు గుణపాఠం చెబుతున్నదా అనే సందేహం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనిసాగుతున్న నేపథ్యంలో భూకంపం రూపంలో ప్రకృతి హెచ్చరిక ఇస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.