Delhi Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చిన భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. నగర ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ఢిల్లీ ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు. ‘‘ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలంతా భద్రతా చర్యలు పాటించాలి. మళ్లీ ప్రకంపనలు వచ్చే ముప్పు ఉంది. అప్రమత్తంగా ఉండండి. పరిస్థితిని అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని పేర్కొంటూ ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
Also Read :Delhi New CM: ఢిల్లీకి కొత్త సీఎం.. నేడు బీజేపీ కీలక నిర్ణయం
ఈరోజు ఢిల్లీ భూకంపం గురించి..
- ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున 5:36 గంటలకు భూకంపం(Delhi Earthquake) వచ్చింది. కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది.
- ఢిల్లీ, నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్ తదితర ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
- భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
- రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Also Read :Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. జనం పరుగులు.. నెటిజన్ల ట్వీట్లు
తెలంగాణ సైతం..
దక్కన్ పీఠభూమి ప్రాంతంలో తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి భూకంపాల భయం అక్కర్లేదనే భావన చాలామందికి ఉండేది. దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే అవకాశమున్న నాలుగు జోన్లు ఉన్నాయి. అందులో తెలంగాణలోని ఏరియాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు కూడా భూకంపాల జోన్‌లోనే ఉన్నాయి. ఇటీవలే ములుగు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. గత 20 ఏళ్లలో ఈస్థాయి భూకంపం తెలుగు రాష్ట్రాల్లో సంభవించలేదని అంటున్నారు. చివరిసారిగా భద్రాచలం వద్ద 1969లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో భద్రాచలం దగ్గర్లోని పర్ణశాల గుడి పడిపోయింది.