Supreme Court : ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కూల్చివేతలు పూర్తిగా అమానవీయం. చట్టవిరుద్ధం. దేశంలో రూల్ ఆఫ్ లా ఒకటి ఉంది. ఈ తరహాలో నివాస భవనాల కూల్చివేత ఒక ఫ్యాషన్ కాకూడదు. బాధితులకు ఆశ్రయం పొందే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించింది. ప్రయాగ్‌రాజ్‌లో చట్టప్రక్రియను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని అసహనం వ్యక్తంచేసింది. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అని ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.
Read Also: BJP: గచ్చిబౌలి భూముల వ్యవహారం..కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తించుకోవాలంది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ ఇళ్లు నిర్మించుకున్న భూమిని హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందినదిగా అధికారులు పొరపాటున గుర్తించారని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తుల వద్ద నోటీసులు అతికించారని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది. ఈ అక్రమ కట్టడాల వ్యాపారాన్ని ఆపాలి. దీనివల్ల వారు తమ ఇళ్లను కోల్పోయారని కోర్టు అధికారుల మండిపడింది.
కాగా, 2023లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి, అందులోని నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా కూల్చివేసిందని బాధితులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిలో ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్‌తో పాటు మరికొందరు ఆ బాధితులు ఉన్నారు. అయితే కూల్చివేతలకు సంబంధించి వారు వేసిన పిటిషన్లను గతంలో అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Also: Tollywood : నా సినిమాలను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ