Site icon HashtagU Telugu

Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. 205 మంది భారతీయులు బ్యాక్

Indian Migrants Us Military Flight India Donald Trump Pm Modi

Donald Trump : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పినంత పనీ ఆయన చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీ వలసదారులను వాళ్లవాళ్ల దేశాలకు తిరిగి పంపిస్తున్నారు. అగ్రరాజ్యంలో అత్యధికంగా ఉంటున్న విదేశీ వలసదారుల్లో భారతీయులు టాప్ ప్లేసులో ఉంటారు. అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం  గుర్తించి, స్వదేశానికి పంపే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా సీ17 సైనిక విమానం 205 మంది భారతీయులను తీసుకొని అమెరికాలోని టెక్సాస్ నుంచి భారత్‌కు బయలుదేరింది. అది ఇంకొన్ని గంటల్లో భారత్‌లో ల్యాండ్ కానుంది. ఈ విమానం భారత్‌లోని ఏ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుంది ? అందులో ఎంత మంది ఉన్నారు ? అనేది తెలియాల్సి ఉంది.  తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్లను మాత్రమే తిప్పు పంపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also Read :YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?

అక్రమ వలసల్లో భారత్ మూడో స్థానం.. 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల్లో మెక్సికో, సాల్వెడార్‌ దేశాల వారే నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేని భారత వలసదారులు దాదాపు 7,25,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం రెడీ అయిందట. ఒక్కొక్క వలసదారుడిని స్వదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం దాదాపు రూ.4 లక్షల దాకా ఖర్చు చేస్తోందని సమాచారం.  అక్రమంగా నివసిస్తున్న దాదాపు 538 మందిని అరెస్టు చేసి, ఇటీవలే అమెరికా నుంచి స్వదేశాలకు పంపించారు. వీరిలో ఎక్కువ మంది గ్వాటెమాలా, పెరు, హోండూరస్‌ తదితర దేశాల వారే. అమెరికాలోని ఎల్‌పాసో, టెక్సాస్‌, శాన్‌ డియాగో, కాలిఫోర్నియాలలో అక్రమంగా ఉంటున్న దాదాపు 5,000 మంది విదేశీయులను కూడా గుర్తించారు. వారందరిని సైతం విడతలవారీగా స్వదేశాలకు పంపిస్తారని తెలిసింది.

Also Read :Satellite Crash : ఇస్రో ప్రయోగం ఫెయిల్.. భూమిపై పడిపోనున్న శాటిలైట్ ?

మోడీ పర్యటన ఇలా.. 

ట్రంప్(Donald Trump) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. వచ్చే వారం భారత ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 12 నుంచి 13వ తేదీ వరకు అమెరికాలో మోడీ పర్యటిస్తారు. 12వ తేదీన సాయంత్రమే వాషింగ్టన్‌‌కు మోడీ చేరుకుంటారు. 13వ తేదీన ట్రంప్‌తో ఆయన భేటీ అవుతారు. అంతకంటే ముందు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న ఏఐ టెక్నాలజీ సదస్సులో మోడీ పాల్గొంటారు. పారిస్ నుంచి నేరుగా వాషింగ్టన్‌కు భారత ప్రధాని చేరుకుంటారు.