Delhi Polls : ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం పరిధిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థిగా పర్వేశ్ వర్మను బరిలోకి దింపారు. ఢిల్లీ సీఎం, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషిపై పోటీ చేసేందుకు కల్కాజీ స్థానంలో ఎంపీ రమేశ్ బిధూరికి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు కైలాశ్ గెహ్లాట్‌కు బిజ్వాసన్ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ(Delhi Polls) ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్‌కు మాలవ్య నగర్ అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. జనక్ పురి అసెంబ్లీ స్థానం నుంచి ఆశిష్ సూద్‌కు కమలదళం అవకాశాన్ని కల్పించింది.
Also Read :700 Women Extortion: ‘అమెరికా మోడల్‌ను’ అంటూ.. 700 మంది అమ్మాయిలకు కుచ్చుటోపీ
బీజేపీ ఇతర అభ్యర్థులు వీరే..
బీజేపీ అసెంబ్లీ టికెట్లు దక్కించుకున్న నేతల్లో.. రాజ్ కుమార్ భాటియా (ఆదర్శ్ నగర్ అసెంబ్లీ స్థానం), దీపక్ చౌదరి (బాడ్లీ), కుల్వంత్ రాణా (రిఠాలా), మనోజ్ షొకీన్ (నాంగ్లోయి జాట్), రాజ్ కుమార్ చౌహాన్(మంగోల్ పురి), విజేంద్ర గుప్తా (రోహిణి అసెంబ్లీ స్థానం), దుష్యంత్ గౌతమ్ (కరోల్ బాఘ్), మంజీందర్ సింగ్ సిర్సా (రాజౌరీ గార్డెన్), అర్విందర్ సింగ్ లవ్లీ (గాంధీ నగర్), రేఖా గుప్తా (షాలిమార్ బాఘ్), రాజ్ కుమార్ ఆనంద్ (పటేల్ నగర్), తర్వీందర్ సింగ్ మర్వా (జంగ్ పురా), అనిల్ శర్మ (ఆర్ కే పురం), గజేంద్ర యాదవ్ (మహ్రౌలీ), కర్తార్ సింగ్ తన్వర్ (ఛాతర్ పూర్) ఉన్నారు.
Also Read :Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం ద్వారా ఎన్నికల ప్రచార బరిలో ముందడుగు వేసింది. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ఆప్, బీజేపీలకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం హస్తం పార్టీకి ప్రతికూలంగా పరిణమించే ఛాన్స్ ఉంది.