700 Women Extortion: అతగాడు డేటింగ్ యాప్‌లు వేదికగా రెచ్చిపోయాడు. తాను అమెరికాలో ఫ్రీలాన్స్ మోడల్‌గా పనిచేస్తున్నానంటూ అమ్మాయిలపైకి వల విసిరాడు. ఈవిధంగా ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఏకంగా 700 మందికిపైగా అమ్మాయిలను వలలో వేసుకున్నాడు. బంబుల్ యాప్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. వారి నుంచి డబ్బులు గుంజాడు. ఆ ఘరానా మోసగాడి(700 Women Extortion) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
అతడి పేరు తుషార్ సింగ్ బిష్ట్. వయసు 23 ఏళ్లు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సును పూర్తి చేశాడు. గత మూడు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా జాబ్ చేస్తున్నాడు. మంచి జాబ్‌లోనే ఉన్నా.. దురాశతో అతడు సైబర్ నేరాలకు ఒడిగట్టాడు. ఒక యాప్ నుంచి వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబరును కొనేసి.. దాని ద్వారా డేటింగ్ యాప్ బంబుల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్‌లలో నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేశాడు. తుషార్ సింగ్ పగలంతా ఆఫీసులో బుద్ధిమంతుడిలా పని చేసేవాడు. రాత్రి కాగానే డేటింగ్ యాప్స్‌లో చెలరేగిపోయేవాడు. తుషార్ బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోలు, స్టోరీలను తీసుకుని తన డేటింగ్ యాప్ ప్రొఫైల్‌లలో పోస్ట్ చేసేవాడు. ‘‘నేను అమెరికాలో ఫ్రీలాన్స్ మోడల్‌గా పనిచేస్తున్నా. త్వరలో భారత్‌కు వస్తున్నాను’’ అని బుకాయించి అనేకమంది అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. వాళ్ల ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలను తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత వాటి ఆధారంగా ఆ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగేవాడు.
Also Read :New Airports : ఏపీలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఇవే..
బండారం బయటపడింది ఇలా..
గత సంవత్సరం(2024) డిసెంబరులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి తుషార్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతడి బండారం బయటపడింది. 2024 జనవరిలో బంబుల్‌లో తుషార్‌తో పరిచయం అయిందని ఆ యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేటు వీడియోలు తీసుకొని తనను బెదిరించాడని ఆమె ఆరోపించింది. తన వీడియోలు, ఫొటోలను డార్క్‌వెబ్‌లో పోస్ట్ చేస్తానని తుషార్ బెదిరించాడని పోలీసులకు సదరు యువతి తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు తుషార్ మోసాల చిట్టాను బయటపెట్టారు. అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.