Site icon HashtagU Telugu

Delhi Deputy CM Manish Sisodia : కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతోంది..!!

Manish Imresizer

Manish Imresizer

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. సిసోడియా ట్వీట్ చేస్తూ…ఎంసీడి, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రివాల్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. ఆప్ ,కేజ్రివాల్ గురించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో సిసోడియా ఈ ప్రకటన చేశారు. కేజ్రివాల్ పై ఆప్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.

తివారీ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు సిసోడియా. సీఎం కేజ్రివాల్ పై దాడి చేయమని ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపి మనోజ్ తివారి తన గుండాలను బహిరంగంగా అడుగుతున్నారని..మండిపడ్డారు. కేజ్రివాల్ మర్డర్ కోసం ప్లాన్ వేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే సిసోడియా చేస్తున్న వాదనలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ పూర్తిగా విసుగు చెందిందని, ప్రజల సానుభూతి కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తోందని పేర్కొంది.

బీజేపీ బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఢిల్లీ, గుజరాత్ లో ఆప్ కు లభిస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడుతోంది.భారీ మెజార్టీతో ఆప్ గెలవడం ఖాయం. అందుకే కేజ్రివాల్ ను చంపేస్తామని బీజేపీ బెదిరిస్తోంది. ఇది ఢిల్లీ ప్రజలను , దేశాన్ని అమానించడమే. బీజేపీకి ఎంతవరకైనా తెగిస్తుందని సిసోడియా ఆరోపించారు.