Delhi New CM: ‘‘ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు ?’’ అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశంతో తెరపడే అవకాశం ఉంది. గతంలో ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన రేఖా గుప్తా పేరును సీఎం పోస్టుకు బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గెల్చిన పర్వేశ్ వర్మ సైతం సీఎం(Delhi New CM) రేసులో ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి సీఎంగా ఛాన్స్ దక్కుతుందా ? అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన మరో నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా ? అనేది వేచిచూడాలి. సీఎం రేసులో విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్‌దేవా, బన్సూరి స్వరాజ్, హరీష్ ఖురానా తదితర నేతలు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 20న(గురువారం) ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని, ఆ రోజే సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని అంటున్నారు.
Also Read :Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. జనం పరుగులు.. నెటిజన్ల ట్వీట్లు
ఇద్దరు పరిశీలకులు
ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకానున్నారు. బీజేపీ హైకమాండ్ పంపిన ఇద్దరు పరిశీలకుల ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతుంది. ఇద్దరు పరిశీలకుల సూచన మేరకు, 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారు.
Also Read :Kesineni Nani : మళ్లీ రాజకీయాల్లో కేశినేని నాని బిజీ..?
సీఎం ఎంపికలో సర్‌ప్రైజ్ తప్పదా ?
గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సీఎంల ఎంపిక విషయంలో బీజేపీ పెద్దలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరూ ఊహించని అభ్యర్థులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను సీఎంలుగా ఎంపిక చేశారు.భజన్ లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినా ఆయనను రాజస్థాన్ సీఎం చేశారు. ఢిల్లీలో సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ పదవుల కేటాయింపులో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్‌లకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వనుంది.