PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

గోవులు పవిత్రమైనవి. వాటికి ఎంతోప్రాముఖ్యత ఉంటుంది. ఆ దూడకు దీప్ జ్యోతి(PM Modis Family) అని పేరు పెట్టాను’’ అని ఆ పోస్ట్‌లో మోడీ రాసుకొచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Deepjyoti Pm Modis Family

PM Modis Family : ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసంలోని ఓ ఆవు.. దూడకు జన్మనిచ్చింది. దానికి ‘దీప్ జ్యోతి’ అని మోడీ నామకరణం చేశారు. ఆ చిన్నారి దూడ నుదుటిని ముద్దాడుతూ ప్రధాని మోడీ దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా ఆ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘నా నివాసంలోని ఓ గోవు..దూడకు జన్మినిచ్చింది. జరగబోయే శుభాలకు ఇదొక సంకేతం. ఆ దూడను చూసి నేను చాలా సంతోషించాను. గోవులు పవిత్రమైనవి. వాటికి ఎంతోప్రాముఖ్యత ఉంటుంది. ఆ దూడకు దీప్ జ్యోతి(PM Modis Family) అని పేరు పెట్టాను’’ అని ఆ పోస్ట్‌లో మోడీ రాసుకొచ్చారు.

Also Read :Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్

ప్రధాని మోడీకి మొదటి నుంచీ జంతువులు, పక్షులను పెంచడం అంటే చాలా ఇష్టం. ఆయన అధికారిక నివాసంలో గోవులు, నెమళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ నివాసంలో మకర సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆ సందర్భంగా ఆరు గోవులకు ప్రధాని మోడీ దాణా తినిపించిన ఫొటోలు/వీడియో వైరల్ అయ్యాయి.

Also Read :Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు, వాయలపాడు, మదనపల్లి, పలమనేరు ప్రాంతాలకు చెందిన గోవులను ప్రధాని నివాసంలో పెంచుతున్నారు. అవన్నీ మరుగుజ్జు జాతికి చెందిన గోవులే కావడం విశేషం. పొట్టిగా ఉన్నప్పటికీ, వాటి నూపురం పెద్దగా ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో చిన్నపాటి కొట్టంలో వాటిని నిర్వహించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జంతు పరిరక్షణ విషయంలో దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ప్రధాని మోడీ నివాసం అందిస్తోందని మనం చెప్పుకోవచ్చు.

  Last Updated: 14 Sep 2024, 01:41 PM IST