Coverts In Congress: ‘‘కాంగ్రెస్‌లోని బీజేపీ కోవర్టులను ఫిల్టర్ చేస్తాం. పనిచేయకుండా కామ్‌గా ఉంటున్న నేతల్లో చాలా మంది బీజేపీ మనుషులే’’ అని ఇటీవలే గుజరాత్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్న నేతల గురించి పార్టీ హైకమాండ్‌కు తెలిసిపోయిందా ? అనేలా ఈ కామెంట్స్ ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. అలాంటి వాళ్లను ఇక ఉపేక్షించేది లేదనే స్పష్టమైన సంకేతాలను రాహుల్ గాంధీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు తమ పనులకోసం అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీతో అంటకాగిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామమూర్తి మధ్య ఆసక్తికరమైన వైరం ఉండేది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డితో సహా అనేకమంది రాజకీయ నేతలు(Coverts In Congress) సొంత పార్టీ నేతల్నే ఓడించుకుని, తమ ముఖ్యమంత్రులనే గద్దె దించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కూడా ఈ వెన్నుపోట్ల రాజకీయాలకు గురైనవారే.
Also Read :Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్..అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్
చేరికలపై బీజేపీకి పట్టు
దిగ్విజయ్‌సింగ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైంలోనే, మధ్యప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఆయన సోదరుడితో సహా అధికార బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కట్ చేస్తే.. అయిదేళ్ల తర్వాత మళ్లీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో దిగ్విజయ్‌సింగ్ సోదరుడితో పాటు బీజేపీలో చేరిన అనేకమంది కాంగ్రెస్ నేతలు సొంత పార్టీలోకి వచ్చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ? బీజేపీని ఎలా విస్తరించాలి ? అనే అంశంపై ప్రధాని మోడీ, బీజేపీ పెద్దలు మంచి పట్టు సాధించారు. అవసరాలు, ప్రయోజనాలు, ప్రలోభాల కోసం రాజకీయాలు చేసే వాళ్లు చాలామందే ఉంటారు. ఇప్పుడు పార్టీల నేతల్లో అత్యధికులు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులే. ఇలాంటి వాళ్లనే బీజేపీ ప్రధాన లక్ష్యంగా చేసుకుంటోంది. తమ వైపు తిప్పుకుంటోంది.
Also Read :Fact Check : బరేలీలో భారత్ భూగర్భ అణుపరీక్షలు.. భారీ బిలం !?
హిస్టరీలో చాలామందే తిరుగుబాటుదారులు
కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి సొంత పార్టీలు పెట్టి.. మళ్లీ కాంగ్రెస్‌లోకే వచ్చి కీలకమైన పదవులు పొందిన నేతలు హిస్టరీలో చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో చెన్నారెడ్డి, ప్రణబ్ ముఖర్జీ, మూపనార్, చిదంబరం, కరుణాకరన్, ఆంటోనీ, బన్సీలాల్, బంగారప్ప, ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్, సుఖ్‌రామ్, సురేశ్ కల్మాడీ లాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వంటి పదవులు అనుభవించిన ఎస్ఎం కృష్ణ, అమరేందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌పిఎన్ సింగ్ లాంటి వారు బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక విధానాల మధ్య వ్యత్యాసం చెరిగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు బీజేపీ తాను ఇతర పార్టీలకంటే భిన్నమైన పార్టీ అని ప్రచారం చేసుకునేది. తద్వారా అది గుర్తింపును సాధించింది. ఇప్పుడు బీజేపీకి భిన్నమైన పార్టీగా తన విశిష్టతను కాంగ్రెస్ నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు.