Article 370 : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఇవాళ మరోసారి అట్టుడికింది. ఈరోజు సెషన్ మొదలుకాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. తనతో తెచ్చుకున్న ఒక బ్యానర్‌ను ఆయన అందరి ఎదుట ప్రదర్శించారు. కశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఆ బ్యానర్‌పై రాసి ఉంది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం తెలపడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్‌పైకి దూసుకెళ్లారు. ఆయన చేతిలో ఉన్న బ్యానర్‌ను లాక్కొని చించేశారు. ఈక్రమంలో బీజేపీ, పీడీపీ పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి.. దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. గొడవలో పాల్గొన్న బీజేపీ, పీడీపీ ఎమ్మెల్యేలను(Article 370) మార్షల్స్ ఎత్తుకొని మరీ సభ బయటకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఖుర్షీద్‌కు అనుకూలంగా స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈనేపథ్యంతో సభను స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.
Massive ruckus in Jammu and Kashmir Assembly.
BJP Vs NC-PDP over Article 370 resolution. #jk #jammukashmir pic.twitter.com/6OdGt3RcAX— Surabhi Tiwari🇮🇳 (@surabhi_tiwari_) November 7, 2024
Also Read :AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
జమ్మూకశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీన్ని పునరుద్ధ రించాలని కోరుతూ పీడీపీ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీరుకు మునుపటిలా ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. ఈనేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ బుధవారం రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ తీర్మానం కాపీలను చింపేశారు. జాతి వ్యతిరేక శక్తులకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు ఆశ్రయం ఇస్తున్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. మొత్తం మీద ఆరేళ్ల గ్యాప్ తర్వాత కశ్మీరులో జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌లో కీలక అంశంగా ఆర్టికల్ 370 మారింది.