Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం

మే 7న(బుధవారం) వేకువజామున భారత సేనలు  ‘ఆపరేషన్ సిందూర్’(Ceasefire Inside Story) నిర్వహించాయి. 

Published By: HashtagU Telugu Desk
Ceasefire Inside Story Pakistans Nuclear Facilities India Attack

Ceasefire Inside Story: ‘సీజ్ ఫైర్.. మహాప్రభో..’ అంటూ భారత్‌తో కాళ్ల బేరానికి పాకిస్తాన్ ఎందుకొచ్చింది ? అంతలా పాకిస్తాన్ భయపడానికి కారణమేంటి ?  మే 10వ తేదీన(శనివారం రోజు) మధ్యాహ్నం అకస్మాత్తుగా పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌కు చెమటలు ఎందుకు పట్టాయి ?  సీజ్ ఫైర్‌ ప్రతిపాదనతో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) రాజీవ్ ఘయ్‌కు పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా ఎందుకు కాల్ చేశారు ? ఇందుకు దారితీసిన అంతర్గత పరిణామాలపై ఇన్‌సైడ్ స్టోరీ..

Also Read :Who is DGMO: నేరుగా పాక్‌తో భారత డీజీఎంఓ చర్చలు.. డీజీఎంఓ పవర్స్, బాధ్యతలేంటి ?

మే 7 నుంచి 10 వరకు ఫైట్.. అంతలోనే అనూహ్యంగా.. 

మే 7న(బుధవారం) వేకువజామున భారత సేనలు  ‘ఆపరేషన్ సిందూర్’(Ceasefire Inside Story) నిర్వహించాయి.  పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. తీవ్ర సైనిక ఘర్షణ జరిగింది. మే 10వ తేదీన (శనివారం) మధ్యాహ్నం వరకు కూడా ఇరుదేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ లాంచ్ ప్యాడ్‌లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేసింది. భారత ఎయిర్‌పోర్టులు, వైమానిక స్థావరాలు, మిలిటరీ బేస్‌లను పాకిస్తాన్ లక్ష్యంగా ఎంచుకుంది. ఈ పోరు అకస్మాత్తుగా మే 10న (శనివారం) మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనూహ్య మలుపు తీసుకుంది.

Also Read :Kashmir Offer : భారత్, పాక్‌లకు ట్రంప్ ‘‘కశ్మీర్ ఆఫర్’’.. ఏమిటది ?

వణికిపోయిన పాక్ ప్రధానమంత్రి

శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారత్‌లోని వివిధ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాకిస్తాన్ యత్నించింది. దీంతో రగిలిపోయిన భారత్.. పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై సూసైడ్ డ్రోన్లతో ఎటాక్స్ చేసింది. అయినా పాకిస్తాన్ దాడులను కంటిన్యూ చేయడంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే కీలక సమావేశం నిర్వహించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, సీడీఎస్‌లతో మోడీ భేటీ అయ్యారు. పాకిస్తాన్‌లోని అణు స్థావరాల మ్యాప్‌పై ఈ కీలక సమావేశంలో చర్చించారని తెలిసింది. దీనిపై పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ చేరింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ హడలిపోయారు. వెంటనే పాకిస్తాన్ అణుబాంబుల విభాగం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వాటి భద్రత కోసం చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఒకవేళ తమ అణు స్థావరాలు, వాటితో ముడిపడిన మౌలిక సదుపాయాలపై భారత్ దాడి చేస్తే ఉపద్రవం సంభవిస్తుందని పాక్ ప్రధాని షాబాజ్ భయపడ్డారు.

ఐరాస, అమెరికాను సంప్రదించిన పాక్

దీనిపై  ఐక్యరాజ్యసమితిని, అమెరికాను పాకిస్తాన్ సంప్రదించింది. ‘‘ఇకనైనా ఆలస్యం చేయొద్దు.. మీరు భారత్‌తో హాట్ లైన్‌ను వాడుకోండి. సీజ్ ఫైర్‌ గురించి భారత్‌కు ప్రతిపాదించండి. లేదంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు’’ అని పాకిస్తాన్‌ ఎదుట అమెరికా ప్రతిపాదించింది. అమెరికా సూచనలు పాకిస్తాన్ ప్రభుత్వం బుర్రకు ఎక్కాయి. దీంతో మే 10న(శనివారం) మధ్యాహ్నం 3:35 గంటలకు, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్‌కు హాట్‌లైన్‌లో కాల్ చేశారు. ఆ వెంటనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.  ఈవివరాలను  భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు.

భారత్ కీలక షరతులు 

ఇతర దేశాల మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్‌తో చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ.. తదుపరి అడుగు పెద్దదిగా ఉంటుందని భారత్ పేర్కొంది. భవిష్యత్తులో అవసరమైతే  పాకిస్తాన్ ఇంధన, ఆర్థిక, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు కూడా ఉంటాయని తేల్చి చెప్పింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సింధూ నదీ జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయం అమలులో ఉంటుందని భారతదేశం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఒక్క ఉగ్రవాద దాడి జరిగినా, దానిని ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని పేర్కొంది. ఉగ్రదాడులకు  శిక్ష ఈసారి కంటే చాలా ప్రాణాంతకంగా ఉంటుందని భారత్  తెలిపింది. తదుపరి దశ సైనిక, దౌత్య మార్గదర్శకాలను నిర్ణయించడానికి భారతదేశం, పాకిస్తాన్  డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌కాల్‌లో చర్చించుకుంటారు.

  Last Updated: 11 May 2025, 01:03 PM IST