Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో తండ్రి పేరు పిరె ఇలియట్‌ ట్రూడో (Canada Vs India)

Published By: HashtagU Telugu Desk
Canadian Pm Justin Trudeau Father Pierre Trudeau

Canada Vs India : కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో నిత్యం భారత్‌పై విషం కక్కుతున్నారు. భారత ఏజెంట్లపై, దౌత్యవేత్తలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది జూన్‌లో కెనడా గడ్డపై జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌కు లింకులు పెట్టేందుకు కెనడా ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తోంది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో తండ్రి పేరు పిరె ఇలియట్‌ ట్రూడో (Canada Vs India). పిరె ఇలియట్‌ ట్రూడో కూడా గతంలో  కెనడా ప్రధానిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన సైతం భారత్ వ్యతిరేక విధానాలను అవలంభించారు. ఖలిస్తానీ వేర్పాటువాదులకు బహిరంగ మద్దతు ప్రకటించారు.ఖలిస్తానీలకు గుడ్డిగా మద్దతు తెలిపే విషయంలో తండ్రీకొడుకులు ఒకే విధమైన వైఖరిని తీసుకున్నారు.

Also Read :Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ

  • ఖలిస్తానీ ఉగ్రవాది తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌.. ఇతగాడు కెనడాలోనే ఉండేవాడు. నేటికీ ఎంతోమంది ఖలిస్తానీ వేర్పాటువాదులకు కెనడా, అమెరికాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
  • 1985 సంవత్సరం జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి బ్రిటన్‌కు ఎయిర్‌ ఇండియా ‘కనిష్క’ విమానం బయలుదేరింది.  అందులో 329 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు.  ఆ విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబులతో గాల్లోనే పేల్చేశారు.
  • ఈ దారుణ ఘటనకు ప్రధాన సూత్రధారి తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌.
  • ఉగ్రవాది తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌‌ను తమకు అప్పగించాలని ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన రిక్వెస్టును  అప్పటి కెనడా ప్రధానమంత్రి పిరె ట్రూడో తిరస్కరించారు. దీంతో అప్పట్లో భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
  • కనిష్క విమానం పేలుడుకు కారణమైన పర్మార్‌ సహా పలువురిని కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే ఇందర్‌జిత్‌సింగ్‌ అనే వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించి మిగతా వారిని వదిలేసింది.
  • నాటి నుంచే ఖలిస్తానీ వేర్పాటువాదులకు కెనడా  ప్రభుత్వాలు బలంగా మద్దతు ఇస్తున్నాయనే విషయం స్పష్టమవుతోంది.

Also Read :Bathing Habits: స్నానానికి ముందు ఆహారం తింటున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

  Last Updated: 15 Oct 2024, 09:42 AM IST