Canada Vs India : ఖలిస్తానీ తీవ్రవాదుల ఓటు బ్యాంకు కోసం బరితెగించిన కెనడా ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే భారత్‌పై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విధమైన మీనింగ్ ఇచ్చేలా తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం వాటిపై తమ ప్రభుత్వంలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇటీవలే విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసాల సంఖ్యను కెనడా తగ్గించేసింది. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. భారత విద్యార్థులకు కెనడాలో అవకాశాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్‌పై ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షలను కెనడా విధించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఇరుదేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగే ముప్పు ఉంటుంది.
Also Read :US Vs Iran : ట్రంప్‌కు ఏదైనా జరిగితే వదలం.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
తమ దేశంలోని ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా సర్కారు వంత పాడుతోంది. వారి ఓట్లతో గెలిచేందుకే అక్కడి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కెనడా కేంద్రంగా ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చేస్తున్న కుట్రలను పరిగణనలోకి తీసుకునేందుకు కెనడా ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేకపోవడం గమనార్హం.
Also Read :Indian Billionaire : అప్పుల ఊబిలో నిరుపేద మహిళ.. అపర కుబేరుడి ఆపన్నహస్తం
కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నాయకుడు, ఖలిస్తానీ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దౌత్యపరమైన ఆంక్షలతో సహా అన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జగ్మీత్ స్వాగతించారు. కెనడాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నెట్‌వర్క్‌ను నిషేధించాలని కోరారు. కెనడా గడ్డపై(Canada Vs India) వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించరాదని ప్రభుత్వానికి జగ్మీత్ సూచించారు.