Site icon HashtagU Telugu

CAG : ‘వికసిత్ భారత్’ పై కాగ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

CAG chief Girish Chandra Murmu's key comments on 'Vikasit Bharat'

CAG chief Girish Chandra Murmu's key comments on 'Vikasit Bharat'

Viksit Bharat : కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్) గిరీశ్‌ చంద్ర ముర్ము ‘వికసిత్ భారత్’ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్‌ భారత్‌ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని ఆయన అన్నారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకం.. సమాఖ్య వ్యవస్థలో అధికార వికేంద్రకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు దొరకలేదు.. అలాగే, దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటుందని కాగ్ చీఫ్ గిరీశ్ ముర్ము పేర్కొన్నారు.

Read Also: Dasoju Shravan : కేటీఆర్‌ కారుపై దాడిని ఖండించిన దాసోజు శ్రవణ్‌

ఇక, ప్రభుత్వ పాలన, వారి అభివృద్ధి, వారికి తగిన వనరులు అందించకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం అంత ఈజీ కాదని కాగ్ చీఫ్ గిరీశ్ చంద్ర ముర్ము తెలిపారు. మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కో అడుగు వేస్తే 140 కోట్ల అడుగులు అవుతాయన్నారు. అందుకే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అని కాగ్‌ వెల్లడించింది. దేశంలో 2.60 లక్షల పంచాయతీలు, 7 వేల స్థానిక సంస్థలు ఉన్నాయి.. స్థానిక సంస్థలను సమర్థంగా తీర్చిదిద్ది ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తే.. దేశానికి చాలా మంచిదని గిరీశ్‌ చంద్ర మర్ము చెప్పారు.

అంతేకాక, స్థానిక సంస్థలను బలోపేతం కాకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని గిరీశ్‌ చంద్ర మర్ము తెలిపారు. స్థానిక సంస్థలకు వెళ్లే నిధుల విషయంలో అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ది కీలక పాత్ర.. కాబట్టి సరైన అకౌంటింగ్‌ విధానాలను పాటించని మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు నిధులు సమీకరించేందుకు పర్మిషన్ ఇవ్వొద్దు.. స్థానిక సంస్థలు సరైన అకౌంటింగ్‌, ఆడిట్‌ విధానాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందని కాగ్ వెల్లడించింది.

Read Also: India Vs China : భారత్‌పై చైనా ‘గ్రే జోన్’ యుద్ధ వ్యూహాలు : భారత ఆర్మీ చీఫ్