Site icon HashtagU Telugu

BRS Out : కేసీఆర్ ఖ‌మ్మం స‌భ‌పై ముక్కోణం, జాతీయ స‌భ‌కాద‌ని తేల్చివేత‌

BRS Out

Brs Out

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన ఖ‌మ్మం స‌భ మీద బీహార్ సీఎం వ్యంగ్యాస్త్రాల‌ను(BRS Out) సంధించారు. ఆ స‌భ కేవ‌లం బీఆర్ఎస్ ఆవిర్భావం మాదిరిగా ఉందని భావించారు. దేశానికి ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా క‌నిపించ‌లేద‌ని నితీష్ కుమార్(Niteesh) అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు, బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఏక‌మ‌యితేనే మోడీ స‌ర్కార్ ను కూల్చ‌గ‌ల‌మ‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాద‌ని తేల్చేశారు. ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ ఖ‌మ్మం స‌భ‌కు వెళ్ల‌లేక‌పోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ఖ‌మ్మం స‌భ మీద బీహార్ సీఎం వ్యంగ్యాస్త్రాల‌ను..(BRS Out)

కాంగ్రెస్, బీజేపీయేత‌ర కూట‌మి దిశ‌గా ఖ‌మ్మం జ‌రిగింద‌న్న అంశాన్ని నితీశ్ కొట్టిపాడేశారు. ఎన్డీయేత‌ర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే జాతీయ ప్రయోజనం ఉంటుంద‌ని(BRS Out) అభిప్రాయ‌పడ్డారు. హైదరాబాదులో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ , వామపక్షాల నాయకులు హాజరైన సమావేశం, బిజెపి ఆధిపత్యాన్ని సవాలు చేసే “ప్రధాన ఫ్రంట్ కాబోద‌ని ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం బీహార్ సీఎంగా ఉన్న నితీష్(Niteesh) కేవ‌లం ఆర్జీడీ మ‌ద్ధ‌తుతో కొన‌సాగుతున్నారు. ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్‌, ఆర్జేడీ చీఫ్ లాలూను క‌లిసిన విష‌యం విదిత‌మే.

Also Read : NTR : నెర‌వేర‌ని ఎన్టీఆర్ క‌ల‌ ‘భారతదేశం’, ఆ దిశ‌గా కేసీఆర్ BRS !

దేశ వ్యాప్తంగా ప‌లువురు సీఎంల‌ను ఖ‌మ్మం స‌భ‌కు కేసీఆర్ ఆహ్వానాల‌ను పంపారు. ప‌క్క‌నే ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం లేదు. అంతేకాదు, యూపీఏ, ఎన్డీయే భాగ‌స్వాములు ఎవ‌రూ హాజ‌రు కాలేదు. యూపీఏ, ఎన్డీయేత‌ర ప‌క్షాల నేతలు అంద‌రూ పాల్గొన‌లేదు. కేవ‌లం ఆప్, క‌మ్యూనిస్ట్ పార్టీల సీఎంలు మాత్ర‌మే ఖ‌మ్మం వేదిక‌పై క‌నిపించారు. అంటే, రాబోవు రోజుల్లో క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తుతో మూడోసారి సీఎం కావాల‌ని కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌లు ఫలించాయ‌ని చెప్పొచ్చు.

ఢిల్లీ సీఎంవో ఆఫీస్ ల్లో ఖ‌మ్మం షెడ్యూల్

పంజాబ్‌, ఢిల్లీ సీఎంలు భ‌గ‌వ‌త్ మాన్‌, కేజ్రీవాల్ ఖ‌మ్మం స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అయితే, త‌మ సీఎంల‌ను కంటి వెలుగు ప్రారంభానికి రావాల‌ని కేసీఆర్ కోరిన‌ట్టు ఆప్ తెలంగాణ నేత‌లు చెబుతున్నారు. ఖ‌మ్మం స‌భ గురించి వాళ్లు తెలంగాణ‌కు రాలేద‌ని ఆప్ ప్ర‌తినిధి ఇందిరా శోభ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు. అంటే, కంటివెలుగు ప్రోగ్రామ్ గురించి చూడ్డానికి మాత్ర‌మే వ‌చ్చార‌ని, ఖ‌మ్మం స‌భ గురించి తెలియ‌ద‌ని ఆప్ చెప్పే మాట‌. ఇద్ద‌రు సీఎంలు వ‌చ్చేట‌ప్పుడు ఒక షెడ్యూల్ ఉంటుంది. పంజాబ్, ఢిల్లీ సీఎంవో ఆఫీస్ ల్లో ఖ‌మ్మం షెడ్యూల్ ఉంద‌ని బీఆర్ఎస్ చెబుతోంది.

Also Read : YCP-BRS : ఖ‌మ్మం స‌భ‌కు సీఎంలు, జ‌గ‌న్ కు ఆహ్వానం నో ! కేసీఆర్ ఎత్తుగ‌డ‌!

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ల‌ను తిరిగి గెలిపించుకోవ‌డానికి కేసీఆర్ నానా తంటాలు ప‌డుతున్నారు. త‌క్కువ సంఖ్య‌లోని ఎంపీల‌తో ఢిల్లీ పీఠం అందుకోవ‌డం క‌ష్టం. కానీ, దేశ వ్యాప్తంగా 100 ఎంపీ స్థానాల‌పై క‌న్నేశార‌ని చెబుతున్నారు. సొంత రాష్ట్రంలోనే బ‌లంలేని కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల్లో ఎంపీలను ఎలా గెలిపించుకుంటారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఇక ఇటీవ‌ల వ‌ర‌కు కేసీఆర్ తో క‌లిసి న‌డిచిన జేడీఎస్ నేత , మాజీ సీఎం కుమారస్వామి హ్యాండిచ్చారు. విభ‌జ‌న వాదిగా పేరున్న కేసీఆర్ తో క‌లిసి న‌డిస్తే వ‌చ్చే న‌ష్టాన్ని ముందుగా ఆయ‌న గ్ర‌హించార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఓడించ‌డానికి రూ. 500 కోట్ల సుఫారీతో కేసీఆర్ వ్యూహం ర‌చించార‌ని స్వామి వ‌ద్ద ఉన్న స‌మాచార‌మ‌ట‌.

ఒక్కొక్క‌ళ్లు కేసీఆర్ కు దూరం

ఏపీ, తెలంగాణ స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గాల్లో విభ‌జ‌న వాదిగా ఉన్న కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త ఉంది. అక్క‌డే జేడీఎస్ కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అక్క‌డ గెలుచుకోవాలంటే, కేసీఆర్ తో క‌లిసి న‌డ‌వ‌కూడ‌ద‌ని భావించార‌ట‌. మొత్తంగా ఒక్కొక్క‌ళ్లు కేసీఆర్ కు దూరం అవుతుండ‌గా, తాజాగా నితీష్ ఖ‌మ్మం స‌భ‌ను చాలా లైట్ గా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.