Site icon HashtagU Telugu

India A Laboratory : ‘‘భారత్ ఒక ప్రయోగశాల’’ అంటున్న బిల్‌ గేట్స్‌.. భారత నెటిజన్ల ఆగ్రహం

Bill Gates India A Laboratory Tech Mogul Micro Soft India

India A Laboratory : ‘‘కొత్త విషయాలను పరిశీలించడానికి భారత్ ఒక ప్రయోగశాల’’ అని మైక్రోసాఫ్ట్‌  వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అన్నారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నా ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగంలో గత 20 ఏళ్లలో భారత్‌ ఎంతో పురోగతిని సాధించిందని ఆయన తెలిపారు. అమెరికా వెలుపల తమకున్న అతిపెద్ద కార్యాలయాలను భారత్‌ భాగస్వామ్యంతోనే నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఇటీవలే రీడ్ హాఫ్‌మన్‌తో పాడ్‌కాస్ట్‌లో ముచ్చటిస్తూ  బిల్‌గేట్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Worlds Richest Cricketer : 22 ఏళ్లకే రిటైర్ అయిన క్రికెటర్.. రూ.70వేల కోట్ల ఆస్తి

బిల్‌గేట్స్ భారత్‌ను ప్రయోగశాలతో(India A Laboratory) పోల్చడంపై అభ్యంతరం తెలుపుతూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు పాటించకుండానే భారత్‌లో బిల్‌గేట్స్‌ కార్యాలయం నడుపుతున్నారని ఆరోపించారు. భారత్‌కు సేవ చేస్తున్నట్టుగా దేశ ప్రజలను, ప్రభుత్వాన్ని బిల్ గేట్స్ ఏమారుస్తున్నారని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘‘భారతదేశ ప్రజలను లేబొరేటరీల్లో ఉండే శాంపుల్స్‌లాగా బిల్ గేట్స్ భావిస్తుంటారు. అలాంటి వాళ్లు భారత్‌లో ఏం చేసినా దేశ ప్రజలకు లాభమేం ఉండదు’’ అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే భారత్‌లో పర్యటించిన బిల్ గేట్స్.. ఐఐటీ ఢిల్లీ, హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌లను సందర్శించారు. భారత ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.

Also Read :Mulugu Encounter Case: ములుగు ఎన్‌కౌంటర్ కేసు.. మల్లయ్య డెడ్‌బాడీని భద్రపర్చండి.. హైకోర్టు ఆదేశాలు