Site icon HashtagU Telugu

Supreme Court : పాకిస్తానీ అని పిల‌వ‌డం కించపరిచినట్లు భావించరాదు : సుప్రీంకోర్టు

Being called Pakistani should not be considered derogatory: Supreme Court

Being called Pakistani should not be considered derogatory: Supreme Court

Supreme Court : ఎవరికైనా పాకిస్తానీ అని పిలవడం మత విశ్వాసాలను కించపరిచినట్లు భావించరాదు. సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నిర్ణయం పలు వివాదాలకు చరమాంకం పలికింది. మియాన్-తియాన్ లేదా పాకిస్తానీ అని సంబోధించడం హేళ‌న‌క‌ర‌మే అయినా, అందులో మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఉద్దేశం లేదని పేర్కొంది. ఈ అభిప్రాయాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని పాకిస్తానీ అని పిల‌వ‌డంతో అత‌ను కేసును దాఖ‌లు చేశారు. ఆ కేసులో ఈరోజు విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చింది.

Read Also: MLC Election Results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ

సమాచారం హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్న నిందితుడు,సమాచారాన్ని పొందేందుకు వెళ్లిన సమయంలో, ప్రభుత్వ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. జార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ అనువాదకుడు ఈ ఫిర్యాదు నమోదు చేశాడు. ఆ ఉద్యోగి మతాన్ని దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, విధులను అడ్డుకున్నట్లు కూడా అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరమైనదే అయినా,మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కానందున,శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంతేగాక, నిందితుడు శాంతి భంగం కలిగించేలా ప్రవర్తించలేదని పేర్కొంది. IPC 353 సెక్షన్ కింద నిందితుడిని శిక్షించేందుకు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసులో,భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని 298 (మతపరమైన విశ్వాసాలను కించపరచడం),504 (అవమానకర ప్రవర్తన),353 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి)సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా, సుప్రీంకోర్టు పలు వివాదాలను పరిశీలించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించే పదాలకు సంబంధించి పునాది రూపకల్పన చేయాలని సూచించింది.

Read Also: Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట