BBC Modi : మోడీకి US, UK మ‌ద్ధ‌తు,BBC డాక్యుమెంట‌రీ ప‌క్ష‌పాత‌మ‌ని తేల్చివేత‌

మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీల‌ను (BBC Modi) బీబీసీ ప్ర‌సారం చేసింది.

  • Written By:
  • Updated On - January 24, 2023 / 03:47 PM IST

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీల‌ను (BBC Modi) బీబీసీ ప్ర‌సారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోష‌ల్ మీడియా, మీడియా వేదిక‌ల‌పై ఆంక్ష‌లు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్ష‌ల‌తో డాక్యుమెంట‌రీని భార‌త ప్ర‌జ‌లు చూడ‌లేక‌పోయారు. కేర‌ళ‌లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించ‌డానికి క‌మ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్ర‌య‌త్నం చేశాయి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్ర‌త్యేక స్క్రీన్ల‌తో డాక్యుమెంట‌రీని ప్లే చేయాల‌ని ప్ర‌య‌త్నించిన వాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కేరళ‌లోని కొన్ని ప్రాంతాల్లో దాన్ని ప్ర‌ద‌ర్శించారు.

మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీల‌ను (BBC Modi)..

గుజ‌రాత్ సీఎంగా న‌రేంద్ర మోడీ ఉన్న‌ప్పుడు జ‌రిగిన గోద్రా అల్ల‌ర్ల‌ను బేస్ చేసుకుని డాక్యుమెంటరీని బీబీసీ(BBC Modi) త‌యారు చేసింది. దాన్ని  బీబీసీ రెండు భాగాల సిరీస్‌ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎంపిక చేసిన ప్లాట్‌ఫారమ్‌ల నుండి కేంద్రం నిషేధించింది. డాక్యుమెంట‌రీ గురించి యూకే, అమెరికా దేశాల‌కు చెందిన అగ్ర‌నేత‌లు స్పందించ‌డానికి ముందుకు రాలేదు. భార‌త(India) ప్ర‌ధాన మంత్రికి ఉన్న క్రేజ్ ను త‌గ్గించ‌డానికి బీబీసీ కుట్ర పూరితంగా త‌యారు చేసిన డాక్యుమెంట‌రీగా భార‌త మూలాలున్న విదేశీయులు భావిస్తున్నారు.

Also Read : Central Govt: ట్విటర్, యూట్యూబ్‌లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రధాని నరేంద్ర మోదీపై BBC డాక్యుమెంటరీ విడుదలైనప్పటి నుండి వివాదానికి దారితీసిన మీడియా ప్రశ్నకు స్పందించారు. “మీరు ప్రస్తావిస్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. అయితే, నేను యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశాన్ని రెండు అభివృద్ధి చెందుతున్న మరియు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా రూపొందించే భాగస్వామ్య విలువలు గురించి నాకు బాగా తెలుసు.` అంటూ మీడియా ముందు చెప్పారు. భారతదేశంతో యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే అనేక అంశాలు ఉన్నాయని, ఇందులో రాజకీయ, ఆర్థిక, ప్రజల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయ‌ని నైడ్ అన్నారు.

అమెరికా ప్రజాస్వామ్యానికి, భారత ప్రజాస్వామ్యానికి ఉమ్మడిగా..

భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని శక్తివంతమైనదిగా పేర్కొంటూ యుఎస్ మరియు భారతదేశం పరస్పరం పంచుకునే దౌత్య సంబంధాలను ఆయన నొక్కిచెప్పారు. దేశాల‌ను విడ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నించే అంశాల గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రంలేదంటూ కొట్టిపారేశారు. అమెరికా ప్రజాస్వామ్యానికి, భారత ప్రజాస్వామ్యానికి ఉమ్మడిగా ఉన్న విలువలను పంచుకోవ‌డం అద‌నంగా ఉన్నాయ‌ని గుర్తు చేశారు. UK ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సమర్థించారు. BBC డాక్యుమెంటరీ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ బ్రిటిష్ పార్లమెంట్‌లో లేవనెత్తిన వివాదాస్పద డాక్యుమెంటరీపై సునక్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిబిసి కథనంపై యూకే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఇది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది. అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “ఇది ప్రచారంలో భాగం అని మేము భావిస్తున్నాము. నిష్పాక్షికత లేదు. ఇది పక్షపాతం. ఇది భారతదేశంలో ప్రదర్శించబడలేదని గుర్తుంచుకోండి.` అంటూ గుర్తు చేశారు.

Also Read : Modi Gold Statue: బంగారంతో మోడీ విగ్రహం.. ప్రధానికి ప్రేమతో!

ప్రముఖ భారతీయ సంతతి UK పౌరులు ఈ సిరీస్‌ను ఖండించారు. ప్రముఖ UK పౌరుడు లార్డ్ రామి రేంజర్ మాట్లాడుతూ “బిబిసి బిలియన్లకు పైగా భారతీయులకు చాలా బాధ కలిగించింది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ, దక్షిణాసియాలో ప్రాంతీయ స్థిరత్వం కోసం యుఎస్ ఎల్లప్పుడూ పిలుపునిస్తుందని, భారతదేశం. పాకిస్తాన్‌లతో దాని సంబంధాలు వారి సొంతంగా ఉన్నాయని అన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చర్చల వేగం, పరిధి రెండు దేశాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. మొత్తం మీద ప్ర‌పంచ వ్యాప్తంగా మోడీ మీద బీబీసీ ప్ర‌సారం చేసిన డాక్యుమెంట‌రీ వివాదం కాగా, ఎవ‌రూ పెద్ద‌గా మ‌ద్ధ‌తు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.