Site icon HashtagU Telugu

Bastar Story 2024: జయమతి అండ్ సుశీల.. నాడు మావోయిస్టులు.. నేడు భద్రతా సిబ్బంది

Sushila Jayamati Bastar Story 2024 Maoists Security Forces Chhattisgarh

Bastar Story 2024:  ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలో అంతటా ఇక్కడి మావోయిస్టులపైనే చర్చ జరుగుతోంది.  ఈసందర్భంగా మనం ఛత్తీస్‌గఢ్‌లోని మాజీ మావోయిస్టులు సుశీల, జయమతి గురించి తెలుసుకోవాలి. వీరిద్దరు ఒకప్పుడు మావోయిస్టులు.. కానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన డీఆర్‌జీ స్క్వాడ్‌లో సేవలు అందిస్తున్నారు. మావోయిజాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసినందుకు సుశీల, జయమతిలకు ఈ జాబ్స్ వచ్చాయి. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జరిగే మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో వీరు చురుగ్గా పాల్గొంటున్నారు.  తమ నేపథ్యం గురించి వారిద్దరూ మీడియాకు ఇలా వివరించారు..

Also Read :Space Explorations 2024 : అంతరిక్షంలో అద్భుతాలు.. గ్రహాల గుట్టు విప్పేలా ప్రయోగాలు

సుశీల, జయమతి  2006 సంవత్సరంలో వేర్వేరుగా మావోయిస్టులలో(Bastar Story 2024) చేరారు. అప్పట్లో వారిద్దరి వయస్సు దాదాపు 15 సంవత్సరాలు. సుశీల మావోయిస్టులలో ఉన్న టైంలో ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో చురుగ్గా పనిచేసేది. జయమతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనేది. దీంతో అప్పట్లో పోలీసులు.. జయమతిపై రూ.5 లక్షల రివార్డును, సుశీలపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.  ఈ దశలో వారు మావోయిజంపై ఆసక్తిని కోల్పోయారు. అయినా తమ ఆపరేషన్లలో పాల్గొనాలని సుశీల, జయమతిలను మావోయిస్టులను భయపెట్టారు. ఒత్తిడి పెంచారు. దీంతో వారు విసిగిపోయి పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

Also Read :Guinness Family Of India : ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’.. ఒకే ఇంట్లో ముగ్గురు రికార్డు వీరులు

జయమతి 2016లోనే లొంగిపోగా.. సుశీల కొన్నేళ్ల క్రితమే లొంగిపోయింది. మావోయిస్టు అగ్రనేతలు వ్యూహ రచన చేయడానికి పరిమితమై.. కింది స్థాయిలో పనిచేసే వారి ప్రాణాలను ఫణంగా పెట్టడాన్ని చూసి తమకు విరక్తి కలిగిందని వారిద్దరూ చెప్పుకొచ్చారు. పోరాటం అన్నాక.. అందరూ కలిసి పాల్గొనాలన్నారు. పోలీసు వ్యవస్థలో కలిసికట్టుగా వ్యవహరించే తత్వం చాలా గొప్పదని సుశీల, జయమతి చెప్పుకొచ్చారు. దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నందుకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు.