MNM : తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా త్రిభాషా విధానంపై తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్రంపై విమర్శలు చేశారు. దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Read Also: Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
డీలిమిటేషన్, భాష అంశాలపై బుధవారం తమిళపార్టీలు సమావేశమయ్యాయి. అలాగే ఆ పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోడీని స్టాలిన్ అభ్యర్థించారు. ఆ సమావేశంలోనే కమల్ హాసన్ మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే.. వారు మాత్రం హిందీయా కలలుకంటున్నారు అని కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు భాష కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆటలొద్దు అని హెచ్చరించారు.
Read Also:YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
ఇది భారతదేశ సమాఖ్య నిర్మాణం, వైవిధ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. భారతదేశ సమగ్ర దృక్పథాన్ని ప్రమాదంలో పడేస్తూ దానిని హిందూగా మారుస్తున్నారని అన్నారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తమిళనాడుకు మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు. ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిమితిని తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించారు.
1976 మరియు 2001లో ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలను కమల్ హాసన్ ప్రేక్షకులకు గుర్తు చేశారు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, సమాఖ్యవాదాన్ని గౌరవించి, జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి విభజించకుండా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశ జనాభా గణనీయంగా పెరిగినప్పటికీ, పార్లమెంటు సభ్యుల (MPలు) సంఖ్య మారలేదని ఆయన వాదించారు.
Read Also: Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ