దేశంలో మావోయిస్టుల (Naxalite) ఉనికి పూర్తిగా అంతమయ్యే వరకూ ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar) కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Sha) వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మావోయిస్టుల పై అనేక విజయవంతమైన ఆపరేషన్లు జరిగాయనీ, భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ముందుకు సాగుతుందన్నారు. వర్షాకాలంలోనూ కూంబింగ్ ఆపకుండా కొనసాగుతుందని చెప్పారు.
Insomnia Problem : నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుందా? ఈ నియమాలు పాటిస్తే దాన్ని దూరం చేయొచ్చు!
మావోయిస్టులతో చర్చలకు అవకాశమే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. “వారు ఆయుధాలు విడిచిపెట్టి సామాన్య జనజీవితంలోకి వచ్చి కలవాలి. లేదంటే వారికి నిద్రపట్టనివ్వం. దేశాన్ని అశాంతికి గురిచేసే ప్రయత్నాలకు కేంద్రం మద్దతివ్వదు. మావో సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని ఆయన హెచ్చరించారు.
2026 నాటికి దేశాన్ని పూర్తిగా మావోయిస్టుల నుంచి శుభ్రం చేయడం లక్ష్యంగా కేంద్రం కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శక్తిని బలపరిచినట్టు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తోందని అమిత్ షా వివరించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టుల ఆధిపత్యం తగ్గిపోతుందని, ప్రజలు శాంతియుత జీవితం గడిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.