Ajit Pawar Net Worth: మహారాష్ట్ర రాజకీయాల నుండి ఒక విషాదకరమైన, దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దిగ్గజ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. బుధవారం బారామతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 66 ఏళ్ల అజిత్ పవార్ తన రాజకీయ చాతుర్యానికే కాకుండా రాష్ట్రంలోని అత్యంత సంపన్న నాయకులలో ఒకరిగా పేరుగాంచారు. ఆయన కోట్లాది రూపాయల ఆస్తులను, భారీ రాజకీయ వారసత్వాన్ని విడిచిపెట్టారు.
బారామతిలో ఘోర విమాన ప్రమాదం
మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘దాదా’గా పిలవబడే అజిత్ పవార్ ఇక లేరు. అందిన సమాచారం ప్రకారం.. బుధవారం ఆయన విమానం బారామతి సమీపంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ భీకర ప్రమాదం సంభవించింది. 66 ఏళ్ల వయసులో ఆయన హఠాన్మరణం రాష్ట్రానికి తీరని లోటు. అజిత్ పవార్ ఆరుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అజిత్ పవార్ నికర ఆస్తి విలువ
అజిత్ పవార్ తన ముక్కుసూటి మాటలతోనే కాకుండా తన ఆస్తుల విషయంలో కూడా తరచూ వార్తల్లో నిలిచేవారు. మీడియా నివేదికలు, ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం.. ఆయన సుమారు రూ. 124 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం వ్యక్తిగతంగా రూ. 45.37 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇందులో రూ. 8.22 కోట్ల చరాస్తులు, రూ. 37.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
Also Read: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిజంగానే మతిమరుపా.. తన ఆరోగ్యంపై ఏమన్నారంటే..!
పెట్టుబడులు- కార్ల మోజు
రాజకీయాల్లోనే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా అజిత్ పవార్‌కు మంచి పట్టు ఉంది. ఆయన పోర్ట్‌ఫోలియోలో షేర్లు, బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాల ద్వారా దాదాపు రూ. 10 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఆయన వద్ద టయోటా కామ్రీ, హోండా సీఆర్వీ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు పెద్ద మొత్తంలో వెండి సామాగ్రి, విలువైన వస్తువులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చారు.
భూములు- భవనాల వివరాలు
స్థిరాస్తుల విషయంలో అజిత్ పవార్ చాలా ముందున్నారు. అఫిడవిట్ ప్రకారం.. అజిత్ పవార్, ఆయన భార్య సునేత్రా పవార్‌కు రూ. 13.21 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ. 37 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉంది. పూణే, బారామతి వంటి ప్రాంతాల్లో వాణిజ్య భవనాలు, కోట్లాది రూపాయల విలువైన నివాస ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన పేరిట నాలుగు పెద్ద ఇళ్లు ఉన్నట్లు సమాచారం.
గడిచిన 5 ఏళ్లలో పెరిగిన ఆస్తి
గత కొన్నేళ్లుగా అజిత్ పవార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2019 నుండి 2024 మధ్య కాలంలోనే ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 10 కోట్లు పెరిగింది. రాజకీయ జీవితంతో పాటు కుటుంబ వ్యాపారాలు ఆయన ప్రధాన ఆదాయ వనరులు. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయనపై రూ. 21.39 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లుగా భావిస్తున్నారు.
