Mood Of The Nation : 79 శాతం మంది సపోర్ట్ ఆ కూటమికే.. పీఎం పోస్టు రేసులో ఆయనే ఫస్ట్!

Mood Of The Nation : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 11:53 AM IST

Mood Of The Nation : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది. ఈ నెల 13 నుంచి 27 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 7.59 లక్షల మంది పాల్గొన్నారు.  ఇందులో వెల్లడైన ఆసక్తికర(Mood Of The Nation) అంశాలివీ..

We’re now on WhatsApp. Click to Join

సర్వేలో పాల్గొన్నవారు ఏం చెప్పారు ?  

  • 79 శాతం మంది ఎన్డీయే కూటమికే మద్దతిస్తామని తెలిపారు.  మిగిలినవారు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ వైపు నిలిచారు.
  • ఉత్తర భారతదేశంలోని హిందీ హార్ట్‌ల్యాండ్‌ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 30.04 శాతం మంది అయోధ్య రామమందిర వాగ్దానాన్ని నెరవేర్చడం మోదీ ప్రభుత్వం అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా రామమందిర అంశంపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
  • మోదీ చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ ఇనీషియేటివ్ ఎంతో గొప్పదని తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనియాడారు.
  • సర్వేలో పాల్గొన్నవారిలో 57.16 శాతం మంది ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో రామమందిరమే కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
  • 51.06 శాతం మంది నరేంద్రమోదీయే టాప్ ప్రయారిటీ అని చెప్పారు. పీఎం పోస్టుకు రాహుల్ గాంధీయే ఫస్ట్ ప్రయారిటీ అని 46.45 శాతం మంది నెటిజన్లు తెలిపారు.
  • ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాన్ని రేట్ చేయమని సర్వేలో పాల్గొన్నవారిని అడగగా.. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) 51.1 శాతం మంది రేటింగ్ ఇచ్చారు. సీఏఏను అమల్లోకి తేవడం బీజేపీకి మైనస్ పాయింట్ అవుతుందని 26.85 శాతం మంది చెప్పారు.
  • సర్వేలో పాల్గొన్నవారిలో 80.5 శాతం మంది తమ ఓటును కులం, అభ్యర్థుల ప్రొఫైల్, ఉచిత హామీలు ప్రభావితం చేయవని చెప్పారు. కేవలం అభివృద్ధిని చూసి తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

Also Read : Naveen Polishetty: హీరో న‌వీన్ పోలిశెట్టికి ప్ర‌మాదం.. రెండు నెలలు సినిమాల‌కు దూరం..?

  • మోదీ వేవ్‌ను ప్రతిపక్షాల ఇండియా కూటమి అడ్డుకోగలదని 32.28 శాతం మంది మాత్రమే చెప్పారు.
  • ఇండియా కూటమి అతిపెద్ద వైఫల్యం ఏమిటని ప్రశ్నించగా.. 48.24 శాతం మంది ‘‘ఇండియా కూటమికి విజన్ లేదు. నాయకత్వ లోపం ఉంది. ప్రధానమంత్రి పోస్టు కోసం చాలామంది పోటీ పడుతున్నారు’’ అని బదులిచ్చారు.
  • రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలను మెరుగుపర్చదని 54.76 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • మోదీ ప్రభుత్వం ప్రధాన వైఫల్యాలు ఏమిటని సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించగా.. ఇంధన ధరలు (26.2 శాతం), నిరుద్యోగం (21.3 శాతం), ద్రవ్యోల్బణం (19.6 శాతం) అని చెప్పారు.
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటని అడగగా.. మణిపూర్‌ హింసాకాండ అని 32.86 శాతం మంది తెలిపారు.

Also Read :Barrelakka: నేడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్న బర్రెలక్క.. వెడ్డింగ్ కార్డు వైరల్