Site icon HashtagU Telugu

Banglore Rape Case: మైనర్‎ని రేప్ చేసిన ముసలోడు.. చితకబాదిన అమ్మాయి బంధువులు.. చివరకు!

Rape

Rape

Banglore Rape Case: దేశంలో నిర్భయ లాంటి ఘటన తర్వాత ఎంత కఠినమైన చట్టాలు తెచ్చినా కానీ రేప్ లు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు మైనర్లు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా రేప్ లు చేస్తున్నారు. బెంగళూరులో తాజాగా ఇలాంటి ఘటనే జరగగా.. ఊహించని విధంగా ఆ కామాంధుడికి శిక్ష పడింది.

తమిళనాడుకు చెందిన కుప్పన్న అనే 72 సంవత్సరాల వ్యక్తి.. బెంగళూరులోని బబూసాపాళ్యాలో ఉంటున్నాడు. చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుండటంతో అతడికి చుట్టు పక్కలి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తన ఇంటి పక్కనే ఉన్న ఓ మైనర్ బాలిక మీద కుప్పన్న చాలాకాలంగా కన్నేశాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

ఇంటి పక్కన ఉంటున్న మైనర్ బాలికను అప్పుడప్పుడు పలకరించే కుప్పన్న.. ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దాదాపు రెండు గంటల తర్వాత మైనర్ బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లగా.. ఇంటి సభ్యులు ఏం జరిగిందని అడిగారు. దాంతో తనకు గుర్తున్నంత వరకు ఆ పాప అన్నీ చెప్పగా.. తన మీద అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు గుర్తించారు.

దాంతో ఆవేశంతో ఊగిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. కుప్పన్నను చితక బాదారు. రక్తం కారుతున్నా అతడు చేసిన పనికి వారి కోపం తీరలేదు. ఎలాంటి దయ లేకుండా అతడిని చితక బాదారు. అయితే విషయం పోలీసులకు చేరడంతో వారు ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తీరా పోలీసులు వచ్చే సమయానికి అతడు స్పృహ కోల్పోయి ఉండగా.. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తీరా కుప్పన్నను ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో పోక్సో యాక్ట్ కింద కుప్పన్న మీద కేసు నమోదు చేసిన పోలీసులు, కుప్పన్న హత్య విషయంలో మరో కేసును నమోదు చేశారు. కుప్పన్న మరణించేలా కొట్టిన వారిలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

Exit mobile version