Pakistan Vs India : పాకిస్తాన్ ఆర్మీ మరోసారి మొండికేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్మీ సహనాన్ని పరీక్షిస్తోంది. 182వ బెటాలియన్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను పీకే సాహు విడుదల విషయంలో కావాలనే సాగదీతకు పాల్పడుతోంది. వారం క్రితం పొరపాటున పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద సరిహద్దును దాటి పాకిస్తాన్ భూభాగంలోకి 2 కిలోమీటర్ల మేర ప్రవేశించిన బీఎస్‌ఎఫ్ జవాన్ పీకే సాహును పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతడి విడుదల విషయంలో గత వారం రోజులుగా పాకిస్తాన్ రేంజర్లతో భారత బీఎస్‌ఎఫ్ అధికారులు ప్రతిరోజూ చర్చలు జరుపుతున్నారు. అంటే ఇప్పటివరకు ఏడుసార్లు ఈ మీటింగ్స్ జరిగాయి. అయితే పాకిస్తాన్ రేంజర్ల నుంచి ఒకే సమాధానం పదేపదే రిపీట్ అవుతోంది. ‘‘ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు’’ అని పాకిస్తాన్ రేంజర్లు బుకాయిస్తున్నారు.కేవలం 15 నిమిషాల్లోనే చర్చల మీటింగ్‌లను ఆపేస్తున్నారు.
Also Read :Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?
సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి ఏమన్నారంటే..
‘‘మేము ప్రతిరోజూ సమావేశం జరుపుతున్నాం. పాకిస్తాన్(Pakistan Vs India) రేంజర్లు రోజూ ఒకే మాట చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని అంటున్నారు. మాకు బుధవారం కూడా అదే ఆన్సర్ ఇచ్చారు’’ అని సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఈ చిన్న సమస్యను పరిష్కరించాలని పాకిస్తాన్‌కు ఉంటే.. గంటల వ్యవధిలోనే బీఎస్ఎఫ్ జవాన్ పీకే సాహును విడుదల చేసి ఉండేది. అలా జరగకపోవడంతో పాక్ దురుద్దేశం ఏమిటో బయటపడింది.
Also Read :BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో..
సైనికులు పొరపాటున సరిహద్దులు దాటిన సందర్భాల్లో ఇరు పక్షాలు చర్చలతో ఆ సమస్యను పరిష్కరించుకున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి మాత్రం పాకిస్తాన్ విషయాన్ని సాగదీస్తోంది. అవనవసర రాద్ధాంతం చేస్తోంది. ఇటువంటి మెంటాలిటీ కలిగిన పాకిస్తాన్ సైన్యంతో కానీ, ప్రభుత్వంతో కానీ చర్చలు జరపొద్దని భారతీయులు సూచిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీరును మనం స్వాధీనం చేసుకుంటేనే భారత్‌లో శాంతిస్థాపనకు అవకాశం ఉంటుందని అంటున్నారు.