Site icon HashtagU Telugu

254 Jobs : నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ల జాబ్స్ .. జీతం రూ.56వేలు

Agniveer Yojana Changes

Agniveer Yojana Changes

254 Jobs : ఇండియన్ నేవీలో 254 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 136 పోస్టులు, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో 18 పోస్టులు, టెక్నికల్ బ్రాంచ్‌లో 100 పోస్టులు(254 Jobs)  ఉన్నాయి. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మార్చి 24 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే వారికి కేరళ రాష్ట్రంలోని ఎజిమలలో ఉన్న  ‘ఇండియన్ నేవీ అకాడమీ’లో 2025 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సు(ST-25)లో అడ్మిషన్ కల్పిస్తారు. ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి. ఈ ఎంపిక ప్రక్రియలో NCC (C సర్టిఫికేట్) అభ్యర్థులకు 5 శాతం మినహాయింపు కల్పిస్తారు. నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు కూడా అప్లై చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఎగ్జిక్యూటివ్ బ్రాంచి 136 పోస్టుల్లో

Also Read : Allu Ayan: షారుక్ ఖాన్ పాటను అద్భుతంగా పాడిన అల్లు అయాన్.. నెట్టింట వీడియో వైరల్?

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: క్వాలిఫయింగ్ డిగ్రీలో సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్​ లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల లభ్యత, సంబంధిత ప్రవేశానికి మెడికల్ క్లియరెన్స్ ఆధారంగా అన్ని ఎంట్రీలకు ఎస్ఎస్​బీ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్​లో ఫిట్​గా తేలిన అభ్యర్థులను ఎంట్రీలో ఖాళీల లభ్యతను బట్టి నియమిస్తారు.

శిక్షణ వివరాలు..

➥ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సబ్-లెఫ్టినెంట్ హోదాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే కోర్సుకు ప్రవేశాలు కల్పిస్తారు.

➥ అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థులను మాత్రమే శిక్షణకు ఎంపికచేస్తారు. ఒకవేళ శిక్షణ సమయంలో వివాహం జరుగుతున్నట్లు తెలిసినా, వివాహం అయినట్లు తెలిసినా.. శిక్షణ నుంచి తొలగిస్తారు. అప్పటిదాకా వారిమీద పెట్టిన ఖర్చు మొత్తాన్ని వసూలుచేస్తారు.

➥ స్వచ్ఛందంగా శిక్షణ నుంచి ప్రారంభదశలో లేదా ప్రొబేషన్ పీరియడ్‌లో వెనుదిరగాలనుకునే వారు శిక్షణ కాలానికయ్యే మొత్తం ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

➥ ఫ్లైయిండ్ ట్రెయినింగ్‌లో(Pilot/NAOO) అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులను సర్వీసు నుంచి తొలగిస్తారు.

ప్రారంభ వేతనం: ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.02.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.03.2024

Also Read : Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం కొత్త రికార్డులు