Site icon HashtagU Telugu

Gang Raped: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Gang Raped

Gang Raped

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Gang Raped) జరిగింది. దీనిపై ఘోసి పోలీసు స్టేషన్‌లో అత్యాచారం ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం 14 ఏళ్ల బాలిక చెత్త వేయడానికి వెళ్లిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రిభువన్ నాథ్ త్రిపాఠి శనివారం (డిసెంబర్ 31) తెలిపారు. ఈ సమయంలో ముగ్గురు యువకులు వచ్చి ఆమెని బలవంతంగా తీసుకెళ్లారు. నిందితులు ఇలా చేయడం కొంతమంది గ్రామస్తులు చూశారని త్రిపాఠి చెప్పారు.

త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్తులు బాలికను వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ కొంత దూరంలో ఉన్న ట్యూబ్‌వెల్ కాంప్లెక్స్ సమీపంలో ఒక గదిని చూశారు. తాళం వేసి ఉన్న ఒక గదిలోకి చూసే సరికి బాలిక కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ బిగించి కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి బాలికను బయటకు తీశారు. తన కూతురిపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలి తండ్రి చెబుతున్నారని తెలిపారు. గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు యువకులపై సామూహిక అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: 186 Terrorists Killed: 2022లో 186 మంది ఉగ్రవాదులు హతం

గతంలో ధోల్పూర్ నగరంలోని నిహల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుత, ఒక మాజీ కౌన్సిలర్‌ ఉన్నారు. ముగ్గురు నిందితులపై మహిళా పోలీస్ స్టేషన్‌లో నామినేట్ కేసు పెట్టింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు.. నిందితులు సదరు మహిళకు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు వెనక్కి తీసుకుంటామనే సాకుతో మహిళను మభ్యపెట్టి ధోల్‌పూర్‌కు పిలిచారు. నిర్జన ప్రదేశంలో నిందితులు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Exit mobile version