TPCC : వాడివేడిగా సాగిన AICC స‌మావేశం.. ఒక‌రిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేత‌లు

కాంగ్రెస్ ఎక్క‌డైనా కాంగ్రెస్సే. ఢిల్లీలో అయినా గ‌ల్లీలో అయినా ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డంలో కాంగ్రెస్ నేత‌ల‌ను మించిన వాళ్లు ఉండ‌రు. ఇవాళా అదే జ‌రిగింది. ఢిల్లీలో జ‌రిగిన ఏఐసీసీ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్న‌ట్టు సమాచారం.

  • Written By:
  • Updated On - November 13, 2021 / 05:15 PM IST

కాంగ్రెస్ ఎక్క‌డైనా కాంగ్రెస్సే. ఢిల్లీలో అయినా గ‌ల్లీలో అయినా ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డంలో కాంగ్రెస్ నేత‌ల‌ను మించిన వాళ్లు ఉండ‌రు. ఇవాళా అదే జ‌రిగింది. ఢిల్లీలో జ‌రిగిన ఏఐసీసీ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్న‌ట్టు సమాచారం. కొండాసురేఖ‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి రేవంతే కార‌ణ‌మ‌ని ఒక‌రు. పార్టీలో టీఆరెస్ కోవ‌ర్టులున్నార‌ని ఒక‌రు.. ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు చేసుకున్నారు. టీనేతల తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఏఐసీసీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం, ఈటల విషయంలో డబుల్ గేమ్ ఆడారంటూ కొందరు నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో హుజూరాబాద్ రాజేసిన చిచ్చు ఏఐసీసీ భేటీతో మరింత పెద్దదైంది.

Also Read : జ‌గ‌న్ పై లోకేష్ `యంగ్ త‌రంగ్ `

ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ ఈటల రాజేందర్ 24 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, సదరు ఎన్నికలో ఇద్దరు ఇండిపెండెంట్లకు అటు ఇటుగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన బల్మూరి వెంకట్ కు కేవలం 3వే ఓట్లు రావడం తెలిసిందే. హుజూరాబాద్ లో ఘోర పరాజయంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం శనివారం నాడు ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితర నేతలతోపాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తరఫున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. భేటీలో ఈటలపై చర్చతోపాటు తీవ్ర వాదనలు, పరస్పర ఆరోపణలు, హెచ్చరింపులు, గద్దింపులతో సాగినట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీ ప్ర‌భుత్వానికి ఏపీ ఎల‌క్ట్రిసిటీ రెగ్యూలేట‌రీ క‌మిష‌న్ ఘాటు లేఖ

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో రెండేళ్ల కిందట 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్.. మొన్నటి ఉప ఎన్నికలో కేవలం 3వేల ఓట్లకు దిగజారడానికి కొందరు నేతల తీరే కారణమంటూ ఏఐసీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కాదర్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో శనివారం నాడు తెలంగాణ నేతలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకుని ఉంటే బాగుండేదని, ఆయనను కాంగ్రెస్ లోకి రానీయకుండా కొందరు నేతలు అడ్డం పడ్డారని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్గ వ్యాఖ్యనించగా, ఆ వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని చెప్పింది మీరే కదా? అని భట్టీని కేసీ నిలదీశారు. విక్రమార్క వ్యాఖ్యలపై కేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : నాడు మండలి ర‌ద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్క‌వుతుందా…?

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారంటూ ఉత్తమ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిపోయేందుకు ఉత్తమ్ సహకరించాడని, టీఆర్ఎస్ లో కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది కూడా ఉత్తమేనని పొన్నం ఆరోపించారు. హుజూరాబాద్ లాగే గతంలో కాంగ్రెస్ దెబ్బతిన్న దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలపైనా ఏఐసీసీ రివ్యూ మీటింగ్ నిర్వహించాలని కేసీని పొన్నం కోరారు.