Slow Heart Rate: మెట్లు ఎక్కడం అనేది మన దైనందిన జీవితంలో ఒక సాధారణ భాగం. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ చిన్న అలవాటు మన గుండె ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. మనం మెట్లు ఎక్కేటప్పుడు శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. అటువంటి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. కండరాలకు రక్తాన్ని చేరవేయడానికి మరింత కష్టపడుతుంది. ఇది సాధారణ ప్రక్రియే కానీ మెట్లు ఎక్కిన తర్వాత శరీరం ఎంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుంది అనేదే అసలైన సంకేతం.
దీని ద్వారా మీరు ఏమి గుర్తించవచ్చు?
కార్డియాలజిస్టులు దీనిని ‘హార్ట్ రేట్ రికవరీ’ (గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి రావడం) అని పిలుస్తారు. మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస, గుండె వేగం త్వరగా సాధారణ స్థితికి వస్తే, అది మంచి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌కు సంకేతం. ఒకవేళ శ్వాస తీసుకోవడం చాలా సేపు ఇబ్బందిగా అనిపించినా లేదా గుండె వేగం సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టినా అది గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతోందని అర్థం.
Also Read: ఊతకర్రల సాయంతో నడుస్తున్న టీమిండియా ప్లేయర్.. వీడియో ఇదే!
నిపుణులు ఏమంటున్నారు?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెట్లు ఎక్కడం వంటి సాధారణ ప్రక్రియ గుండె ఆరోగ్యం గురించి ఎంత కీలక సమాచారాన్ని ఇస్తుందో చాలామంది గ్రహించలేరని తెలిపారు. మెట్లు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ అవసరం పెరిగి గుండె వేగం పెరగడం సహజమని, అయితే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే మాత్రం గుండె లేదా రక్తనాళాల పనితీరులో లోపం ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
గుండె ఎంత సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేస్తోంది. ధమనులు ఆక్సిజన్‌ను ఎంత సులభంగా శరీరానికి అందిస్తున్నాయి. కండరాలు ఆ ఆక్సిజన్‌ను ఎంత సరిగ్గా వినియోగించుకుంటున్నాయి అనే అంశాలపై రికవరీ స్పీడ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
ఈ సమస్యకు కారణాలేంటి?
ఆధునిక జీవనశైలి ఈ సమస్యకు ప్రధాన కారణం. గంటల తరబడి కూర్చుని పని చేయడం, అసమతుల్య ఆహారం, ధూమపానం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె, రక్తనాళాలు బలహీనపడతాయి. దీనివల్ల ధమనులు గట్టిపడి రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి.
