Site icon HashtagU Telugu

White Hair: తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే చాలు ఐదు నిమిషాల్లో జుట్టు నల్లగా మారడం ఖాయం..?

White Hair

Are You Suffering From White Hair Problem.. If You Do This, Your Hair Will Turn Black In Just Five Minutes..

White Hair: ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది తెల్ల జుట్టు (White Hair) సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. అయితే రాను రాను ఈ తెల్ల జుట్టు సమస్య చిన్నపిల్లల నుంచే మొదలవుతోంది. తెల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు మొత్తం మెరిసిపోవడం చుండ్రు సమస్యలు రావడం ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇక యుక్త వయసు వారికి ఇలా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడి ముసలి వారిలో కనిపించడంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇందుకు గల ప్రధానం కారణం మనం తినే ఆహార పదార్థాలే అని చెప్పవచ్చు.

అయితే ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటం కోసం చాలామంది మార్కెట్ లో దొరికే రకరకాల కలర్స్ అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఇంగ్లీష్ మందులను కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటివి ఏమీ లేకుండా ఈ చిట్కాలను పాటిస్తే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రస్తుత రోజుల్లో తల స్నానానికి సబ్బులు షాంపూలు ఉపయోగిస్తున్నాము. కానీ పూర్వం రోజుల్లో మన పెద్దలు మాత్రం కుంకుడుకాయలు చీ కాయిలు, గంజి వంటివి ఉపయోగించి తల స్నానం చేసేవారు. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో బంగాళదుంప ఎంతో బాగా పనిచేస్తుంది.

Also Read: IT Raids In Vivek : వివేక్ ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరులో భారీ ర్యాలీ

అందుకోసం బంగాళదుంపను తీసుకొని తొక్క తీసి నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి ఆపై జుట్టుని శుభ్రంగా తుడిచి ఈ బంగాళదుంప తొక్కలు ఉడికించిన నీటిని తలకు బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉండి చల్లనీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం. అయితే తెల్ల జుట్టు అధికంగా ఉంటే ఎక్కువ సార్లు అప్లై చేయడం మంచిది. అయితే ఈ రెమెడీని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

We’re now on WhatsApp. Click to Join.