Fish: ఆ చేపలు తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు?

చేపల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. వైద్యులు కూడా తరచుగా చేపలు తినమని చెబుతూ ఉంటారు. చేపలు తినడం వల్ల కంటికి

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 10:30 PM IST

చేపల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. వైద్యులు కూడా తరచుగా చేపలు తినమని చెబుతూ ఉంటారు. చేపలు తినడం వల్ల కంటికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఏ ఏ చేపల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం… సాల్మన్ చేపలల్లో ఒమేగా 3 ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుంది. వ్యవసాయ సాల్మన్ అడవి సాల్మన్ కంటే తక్కువ ధరకే లబిస్తాయి. కాబట్టి వీటిని చాలా మంది కొంటారు. కానీ, అడవి సాల్మన్ చేప చాలా మంచిది. ఇందులో విటమిన్, మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల సంఘం ప్రకారం, సాల్మన్ చేప పెద్దది, పాతది. అది ఎక్కువ మెర్క్యూరీ కలిగి ఉంటుంది. అలాగే ట్యూనా చేపల్లో విటమిన్ బి 12, డిలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా తక్కువ కొవ్వు, ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలు, గర్భిణీలు తరచుగా వీటిని తినడం మంచిదని చెబుతారు నిపుణులు. అదే విధంగా, క్యాన్డ్ ట్యూనాలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇది ఒకటి. దీనినే పొలుసుల చేపల అని కూడా అంటారు. ఇందులో విటమిన్ బి12, ఒమేగా 3లు ఎక్కువగా ఉంటాయి. ఈ చేప ప్రోటీన్‌కి మంచి మూలం.

ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. అథెరోస్క్లోరోసిస్‌ తో బాధపడేవారికి, డయాబెటిక్ హార్ట్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఈ చేపలు తినడం గుండె చాలా మంచిది. ఈ చేపలు తినేవారికి గుండె సమస్యలు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందట. మంచినీటి ట్రౌట్ తినడం కూడా మంచి ఎంపిక. ఈ చేపల్లో ఒమేగా 3 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపఉనులు రెయిన్ బో ట్రౌట్, అడవి ట్రౌట్‌ని తీసుకోమని చెబుతారు. అలాగే చేపలు కొద్దిగా చూడ్డానికి సార్డిన్ చేపల్లా ఉంటాయి. విటమిన్ డి, జింక్‌కి మంచి మూలం ఈ చేపలు, హెర్రింగ్ మృదువైన మాంసం, మంచి రుచిని కలిగి ఉంటాయి.

హెర్రింగ్ చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. హెర్రింగ్ చేపల్లో లభించే ప్రోటీన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆయిలీ ఫిష్. సార్డినెస్ దాని చర్మం, ఎముకలు వినియోగించడం వల్ల ఎక్కువ పోషణని అందిస్తాయి. సార్డినెస్ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి గుండె జబ్బుల నుండి కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకి వీటిని తింటారు. ఎముకలని బలంగా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.