ప్రస్తుత కాలంలో చాలామంది జీవనశైలిలో కలిగే మార్పుల కారణంగా ఐరన్ లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ ఐరన్ లోపం కారణంగా బలహీనంగా ఉండటం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల జుట్టు రాలడం, నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు అన్నీ కూడా ఐరన్ లోపం వల్ల కలుగుతాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఐరన్ లోపం వల్ల మరిన్ని సమస్యలు వస్తూ ఉంటాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలిసిపోతూ ఉంటారు. అలాగే ఉన్నవారు ఎక్కువగా చికాకుగా అనిపించడం, మనిషి బలహీనంగా మారడం వంటివి కూడా ఐరన్ లోపం లక్షణాలే. నిద్రలో కాళ్లు అదే పనిగా కదిలించడం, దురదలు రావడం, మెదడులోని రక్త ప్రసరణలో మార్పుల వల్ల తలనొప్పిగా అనిపించడం వంటివి ఐరన్ లోపం లక్షణాలు. అలాగే ఐరన్ లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతూ టెన్షన్ పడుతూ ఉంటారు.
అలాగే ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా మందగిస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజమ్ అనే సమస్య తలెత్తవచ్చు. అలాగే బరువు పెరుగుతుండటం, శరీరం చల్లగా అనిపించడం, జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుకపై మంట పుట్టడం వంటివీ ఐరన్ లోపం లక్షణాలు.
