మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీంతో కడుపులో మంటగా, నొప్పిగా అనిపించడం పాటు వికారం వంటి సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల చాలామంది ఈ గ్యాస్ సమస్యకు మందులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.
అయితే ఈ మందులను వాడటం వల్ల కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది కానీ, ఈ మందులు దీర్ఘకాలికంగా ఉపయోగపడవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కడుపును ప్రశాంతంగా ఉంచడంలో మరియు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడంలో తమలపాకు చక్కగా ఉపయోగపడుతుంది. తమలపాకుతో గ్యాస్ సమస్యలను ఏ విధంగా అరికట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో భోజనం అనంతరం తమలపాకును నమలడం లేదా పాన్ వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరు గుల్కంద్, తరిగిన వాల్‌నట్‌లు, కొబ్బరి పొడి, తేనె, లవంగాలు, యాలకుల గింజలు వేస్తారు. ఈ పాన్ తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవి మన జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా లాలాజలం విడుదలను ప్రేరేపిస్తాయి. అలాగే తమలపాకుల నుండి నూనెను తయారు చేసి, కడుపుపై మసాజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. ఇది జ్యూస్‌లు మరియు జీర్ణ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు పొట్టలోని pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి లేదా నానబెట్టిన తమలపాకులను తినండి; అది గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేస్తుంది.
