Site icon HashtagU Telugu

Paneer : రుచి మాత్రమే కాదు పనీర్ వల్ల లాభాలు ఎన్నో లాభాలు..!

Paneer Fresh

Paneer Fresh

ఎంత నాన్ వెజ్ తిన్నా సరే పనీర్ తో చేసిన స్పెషల్ డిష్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఒక వెజిటేరియన్స్ అయితే పనీర్ (Paneer) లో ఎన్ని రకాల ఐటెంస్ ఉంటాయో వాటన్నిటినీ ప్రయత్నించాలని అనుకుంటారు. పన్నీర్ తో చేసే వంటకాలతో కడుపునిండా హాయిగా తినే అవకాశం ఉంటుంది. అయితే పనీర్ కేవలం రుచికి మాత్రమే కాదు పోషకాలు ఉంటాయి. పాలను విరగొట్టి చేసే ఈ పనీర్ లో కాల్షియం, విటమిన్ డి, ఈ, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

పనీర్ (Paneer) డైట్ లో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పనీర్ లో ఉండే విటమిన్ డీ,ఈ ల వల్ల ఎముకలు, దంతాలు దృడంగా ఉంటాయి. పనీర్ తో గుల్లబారిన ఎముకలు కూడా గట్టిపడతాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పు నుంచి తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు కూడా రాకుండా చేస్తుంది.

పనీర్ ను మహిళలు తీసుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పనీర్ తీసుకోవడం వల్ల రొమ్ము, కొలన్ క్యాన్సర్ల నుంచి ముప్పు తగ్గుతుంది. పనీర్ లో ఉండే కొవ్వి, ప్రొటీన్ వల్ల గర్భిణులకు వేవిళ్లు, బలహీనత సమస్యలు రాకుండా ఉంటుంది. కడుపులో బిడ్డ ఎదుగుదలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

పనీర్ లోని లిపిడ్లు, పొటాషియం హైపర్ టెన్ష లను కంట్రోల్ లో ఉంచేలా చేస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ రుమాటాయిడ్ ఆర్ధరైట్స్, ఎముక సంబంధిత సమస్యలు రాకుండా గుండె సమస్యలు రాకుండా కూడా పనీర్ ఉపయోగపడుతుంది. పనీర్ లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పనీర్ లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి.

Also Read : SBI Annuity Deposit Scheme : ప్రతినెల ఆదాయం వచ్చే ఎస్బీఐ ఈ స్కీం గురించి తెలుసా..?