Beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 05:32 PM IST

మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికి తెలిసిందే. కొందరు మాత్రం మద్యం సేవించడం మంచిది అంటుంటారు. అయితే వైద్యులు మాత్రం మందుతో పోలిస్తే బీర్లు తాగడం మంచిదే అని అంటున్నారు. బీర్లలో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉంటుంది. కాబట్టి బీర్లు పరిమితంగా తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు.అయితే చాలామంది సమ్మర్‌లో బీర్లు తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమ్మర్‌ లో బీర్ తాగితే కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా బీరు తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బీరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బీరులో సిలికాన్ ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. బీరులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మితంగా బీరు తాగడం వల్ల మూత్రపిండాల రాళ్ళ ప్రమాదం తగ్గుతుంది. అలాగే బీరు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. బీరు తాగడం వల్ల ప్రోబయోటిక్స్, ఫైబర్ వంటి జీర్ణక్రియకు మంచి పోషకాలు బీరులో ఉన్నాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీరులో ఉండే సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీరులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అయితే బీరు తాగడం మంచిదే కదా అని ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు.