Watermelon Rind : వేసవి అనగానే మనకు మామిడి పండ్లు, పుచ్చకాయలు గుర్తుకు వస్తాయి. ప్రత్యేకించి సీ విటమిన్ కోసం మనం పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటాం. వీటిలో 92 శాతం మేర నీళ్లే ఉంటాయి. అందుకే పుచ్చకాయలను తింటే మన శరీరం హైడ్రేట్ అవుతుంది. చివరకు పుచ్చకాయ తొక్క కూడా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రత్యేకించి పురుషులకు షాకింగ్ బెనిఫిట్‌ను అందిస్తుంది. ఆ వివరాలు చూద్దాం..
Also Read :Dadasaheb Phalke : భారతీయ సినిమా పితామహుడు.. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలుసా ?
పుచ్చకాయ తొక్కలో..
- పుచ్చకాయ తొక్క(Watermelon Rind)పై ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ అధ్యయనం చేసింది. ఆ వివరాలతో ఒక నివేదికను ప్రచురించింది.
- పుచ్చకాయ తొక్కను తక్కువ అంచనా వేయొద్దు. అందులో సిట్రులిన్ ఎక్కువగా ఉంటుంది.
- సిట్రులిన్ వల్ల మన శరీర కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల వ్యాకోచం మెరుగు అవుతుంది.
- పుచ్చకాయ తొక్క తింటే మన బీపీ (రక్తపోటు) కూడా కంట్రోల్‌లోకి వస్తుంది.
- తక్షణ శక్తి సైతం లభిస్తుంది.
- పుచ్చకాయ తొక్కలో లైకోపీన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి శరీరంపై ముడతలను తగ్గిస్తాయి.
- ఇది పురుషులలో లైంగిక కోరిక పెంచుతుంది.
- పుచ్చకాయ తొక్కలోని అమైనో యాసిడ్‌లు లైంగిక ఆకర్షణను పెంచుతాయి.
పుచ్చకాయ గింజల్లో..
- పుచ్చకాయ గింజల్లో విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.
- ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
- వాపును తగ్గిస్తాయి.
- ఎముకలను బలోపేతం చేస్తాయి.
పుచ్చకాయలో..
- పుచ్చకాయ తింటే గుండెపోటు, ఉబ్బసం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
- జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు అవుతుంది.
- మూత్రపిండాల్లోని రాళ్లు కరుగుతాయి.
- మలబద్ధకంతో బాధపడేవారు పుచ్చకాయ తింటే మంచిది.
- విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.