Benefits of Ghee : ప్రతిరోజూ నెయ్యి తింటే.. ఎన్ని ప్రయోయోజనాలు ఉన్నాయో తెలుసా?

ప్రతి రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారన్నది చాలా మంది భ్రమ. నిజానికి రోజూ నెయ్యి తినే అలవాటున్నవారు ఫిట్ గా ఉంటారు.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 08:45 PM IST

నెయ్యి..(Ghee) ఈ జనరేషన్లో పుట్టే పిల్లలకు రెడీమేడ్ గా బయట షాపుల్లో దొరికే నెయ్యిని కొనుగోలు చేసి పెట్టేస్తున్నారు. కానీ ఒకప్పుడు పిల్లలకు అన్నప్రాసన అయింది మొదలు రోజూ అన్నంలో పప్పు కలిపి ఉడకబెట్టి, అందులో నేచురల్ గా తయారు చేసిన నెయ్యిని కలిపి పెట్టేవారు. అందుకే అప్పట్లో ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఆరోగ్యంగా ఫిట్ గా కనిపిస్తారు.

ప్రతి రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారన్నది చాలా మంది భ్రమ. నిజానికి రోజూ నెయ్యి తినే అలవాటున్నవారు ఫిట్ గా ఉంటారు. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఈ, కె లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

1.కంటిచూపుకి, చర్మం అందంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఎ అవసరం ఉంటుంది. అలాగే ఎముకల వ్యాధిని నియంత్రించడంలోనూ నెయ్యి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

2.ఇక నెయ్యిలో ఉండే విటమిన్ డి.. దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, మల్టిపుల్ స్క్లెరోసిన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

3.నెయ్యిలో ఉండే విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.

4.నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.

5.న్యాచురల్ గా తయారు చేసిన నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. ప్రతిరోజూ తినే ఆహారంలో రెండు ముద్దల్లో నెయ్యి కలుపుకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

6.పిల్లలకు చిన్నప్పటి నుండే నెయ్యిని అలవాటు చేయడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆవునెయ్యి వాడటం మరింత మంచిది.

 

Also Read :  Weight Loss Diet : ఈ డైట్ ప్లాన్ తో నెలరోజుల్లోనే బరువు తగ్గండి