Site icon HashtagU Telugu

Curry Leaves Water: క‌రివేపాకు నీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Curry Leaves Water

Curry Leaves Water

Curry Leaves Water: కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిన సమస్య. ప్ర‌స్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మీరు ఈ హోం రెమిడీని ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అయితే మ‌నం ఇప్పుడు కరివేపాకు నీళ్ల (Curry Leaves Water) గురించి తెలుసుకుందాం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు, దాని నీటిని ఎలా తీసుకోవాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

కరివేపాకు నీటి ప్రయోజనాలు

Also Read: Weight Loss Formula: 30-30-30 వెయిట్ లాస్ ఫార్ములాతో బ‌రువు త‌గ్గుతారా..?

ఎలా వినియోగించాలి..?

ముందుగా తాజా కరివేపాకులను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాన్‌లో నీటిని మరిగించాలి. కడిగిన కరివేపాకును వేడినీటిలో వేయాలి. దీని తర్వాత తక్కువ మంట మీద 5-8 నిమిషాలు మ‌రిగించాలి. తర్వాత చల్లారాక ఆ నీటిని వడపోసి గ్లాసులోకి తీసుకోవాలి. కావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకుని తాగవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.