Polished Rice : వడ్లను మిల్లులో ఎక్కువసార్లు మర ఆడించి తెల్లటి బియ్యంగా మార్చేసి వాడుతుంటారు. ఇలాంటి తెల్లన్నం తినే వారికి ‘బెరి బెరి’ అనే వ్యాధి ముప్పు ఉంటుందని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. పైపొర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వాడే వారికి గుండె జబ్బుల ముప్పు ఉంటోందని తెలిపారు. డబుల్ పాలిష్డ్ బియ్యంతో వండిన అన్నం తింటే.. మన శరీరంలో ‘థయామిన్ బి1’ అనే విటమిన్ లోపిస్తోంది. ఈ విటమిన్ లోపం వల్లే గుండె జబ్బులు వస్తున్నాయి. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి తినే వారిలో ‘థయామిన్ బి1’ విటమిన్ లోపం పెద్దగా ఉండటం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే మన ఆహార మెనూలో గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన ఫుడ్ ఐటమ్స్‌ను కూడా చేర్చుకుంటే బెటర్.
Also Read :Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !
బియ్యంలో నుంచి థయామిన్ విటమిన్ మాయం..
- సాధారణంగా వరి ధాన్యంపై రెండు పొరలు ఉంటాయి. పైన ఉండే పొరను ఊక(Polished Rice) అంటారు. దీన్ని తొలగించి ఇటుక బట్టీల్లో వాడుతుంటారు. ఎందుకంటే.. ఊకను మండిస్తే త్వరగా వేడిని పుట్టించగలదు.
- బియ్యంలోని రెండో పొరను తవుడు అంటారు. దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వేస్తుంటారు. తవుడుతో వంటనూనెను కూడా తయారు చేస్తుంటారు. దీన్నే ఇంగ్లీష్ భాషలో ‘రైస్ బ్రాన్ ఆయిల్’ అని పిలుస్తారు.
- బియ్యంలోని రెండు పొరలను తొలగించిన తర్వాత అసలైన కార్బోహైడ్రేట్ (బియ్యపు గింజ) మిగులుతుంది. తెల్లగా కనిపించాలని.. బియ్యపు గింజలను మిల్లుల్లో అతిగా పాలిష్ చేయిస్తుంటారు.
- బియ్యాన్ని ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే థయామిన్ అనే విటమిన్ వెళ్లిపోతుంది. బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగినా, అన్నం వండే క్రమంలో గంజిని పారబోసినా థయామిన్ తొలగిపోతుంది.
- ప్రభుత్వ రేషన్ దుకాణాల కోసం అందించే బియ్యంలో విటమిన్లు లోపిస్తున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. వాటిలో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లను కలిపి సప్లై చేస్తోంది. వరి ధాన్యంలోని పైపొరలను తొలగించకుండా వదిలేస్తే.. బియ్యంలోని విటమిన్లు అలాగే ఉంటాయి. అదనంగా విటమిన్లను కలపాల్సిన అవసరం ఉండదు.
Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో బీ అలర్ట్.. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు వారఫలాలు
బెరి బెరి వ్యాధి గురించి..
- బీ విటమిన్‌లో థయామిన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకొబాలమైన్ అనేవి ఉంటాయి. మన శరీరంలోకి చేరే పిండి పదార్థాలు శక్తిగా మారడానికి థయామిన్ దోహదం చేస్తుంది.
- థయామిన్ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
- ఈ విటమిన్ లోపం నవజాత శిశువుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
- థయామిన్ విటమిన్ లోపం వల్ల వచ్చే బెరిబెరి సమస్య గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువులకు ఈ సమస్య సంక్రమిస్తుంది.
- ఏడాదిలోపు పిల్లలకు కూడా ‘బెరి బెరి’ సమస్య వస్తుంటుంది. దీనివల్ల వారు గుండె వైఫల్య సమస్యను ఎదుర్కొంటారు.
- పెద్దవారిలో థయామిన్ లోపం వల్ల కాళ్ల వాపులు, కాళ్లలో తిమ్మిర్లు, ఆయాసం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తుతాయి.